November 21, 2024
SGSTV NEWS
Andhra Pradesh

భగవంతుడి సేవ తప్ప మరో ధ్యాస లేని అర్చకుల పైన వైసీపీ నాయకులు దాడులు చేయడం దుర్మార్గం….

*మచిలీపట్నం*
*26/03/2024*

*భగవంతుడి సేవ తప్ప మరో ధ్యాస లేని అర్చకుల పైన వైసీపీ నాయకులు దాడులు చేయడం దుర్మార్గం….*


*అర్చక సోదరులపై వైసీపీ దాడి దుర్మార్గం….*

*అర్చకులపై దాడులు జరుగుతున్న అధికారులు పట్టించుకోకపోవడం దుర్మార్గం….. తెలుగుదేశం పార్టీ బ్రాహ్మణ సాధికార సమితి జిల్లా కన్వీనర్, పి. వి. ఫణి కుమార్….*

*తెలుగుదేశం పార్టీ బ్రాహ్మణ సాధికార సమితి కృష్ణాజిల్లా కన్వీనర్, పి. వి. ఫణి కుమారు, తెలుగుదేశం పార్టీ బ్రాహ్మణ నాయకులు, నిమ్మగడ్డ శ్రీధర్, పి గణేష్ చడగా, బిజెపి నాయకులు, ధూళిపాళ్ల శ్రీరామచంద్రమూర్తి, నాగలింగం అయోధ్య రామచంద్ర ర రావు లు మంగళవారం మచిలీపట్నం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నిర్వహించిన పాత్రికేయుల సమావేశం వివరాలు….*

ప్రజలందరూ సుఖశాంతులతో ఉండాలని ప్రతి రోజు లో కసంక్షేమం కోసం పూజలు చేసే అర్చకులు, పూజారులపై వైసీపీ పాలనలో దాడులు విపరీతంగా పెరిగిపోయాయి అన్నారు.

రాష్ట్రంలో వై కాపా మూకల అరాచకానికి అడ్డు అదుపు లేకుండా పోతోంది. ఐదేళ్ల జగన్మోహన్ రెడ్డి పాలనలో ఏ ఒక్క వర్గము ప్రశాంతంగా జీవనం సాగించ లేని
పరిస్థితులు వైసీపీ పాలకులు కల్పించారు అన్నారు.

కాకినాడ శివాలయంలో సోమవారం అర్చకులుగా పనిచేస్తున్న సాయి శర్మ, విజయ్ కుమార్ శర్మలపై సాక్షాత్తు ఆలయంలో వైసీపీ మాజీ కార్పొరేటర్ సిరియాల చంద్రశేఖర్ దాడికి పాల్పడడం దుర్మార్గమైన చర్య అన్నారు.

దేవాలయములో పూజలు చేసుకునే అర్చకులు, పూజారులపై వైసిపి అధికారంలోకి వచ్చిన నాటినుండి విపరీతమైన దాడులు జరుగుతున్నాయి అన్నారు.

ముఖ్యంగా అర్చకులు, పూజారులు అందరూ బాగుండాలని కోరుకుంటారని అలాంటి అర్చకులపై కాకినాడ లోభౌతికంగా దాడులు జరిపిన వైసిపి మాజీ కార్పొరేటర్ సిరియాల చంద్రశేఖర్ పై తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

కాకినాడ జిల్లా ఎండోమెంట్స్ ఆఫీసర్ ఈ దాడి పై జోక్యం చేసుకొని చట్టపరమైన చర్యలు తీసుకోవాలన్నారు.

భగవంతుడి సేవ తప్ప మరో ధ్యాస లేని అర్చకుల పైన వైసీపీ నాయకు లు
ప్రతాపం చూపడం దుర్మార్గం అన్నారు. కాకినాడలో ఆలయ పూజారులపై దాడి చేసిన వైసిపి నేత సిరియాల చంద్రశేఖర్ అతని అనుచరులను తక్షణమే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు.

అర్చకులపై దాడి చేసిన వారిని వెంటనే అరెస్టు చేయకపోతే రాష్ట్రవ్యాప్తంగా బ్రాహ్మణ సంఘాలతో ఎన్నికల కోడ్ లో కూడాఉద్యమాలు చేయాల్సిన పరిస్థితులు ఉన్నాయి అన్నారు.

Also read

Related posts

Share via