మోగల్లు: పశ్చిమ గోదావరి జిల్లా పాలకోడేరు మండలం మోగల్లులో అమానవీయ ఘటన (Crime News) చోటు చేసుకుంది. తన భర్తతో వివాహేతర సంబంధం పెట్టుకుందని ఆరోపిస్తూ భార్య, ఆమె బంధువులు ఓ మహిళను చెట్టుకు కట్టేసి చితకబాదారు. మంగళవారం రాత్రి నుంచి ఆమెను చిత్రహింసలకు గురి చేశారు. ఈ ఘటన సామాజిక మధ్యమాల్లో వైరల్ కావడంతో పాలకోడేరు పోలీసులు అక్కడికి చేరుకున్నారు. బాధిత మహిళను భీమవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మహిళపై దాడికి పాల్పడిన వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై రవివర్మ తెలిపారు
Also read
- నేటి జాతకములు 10 సెప్టెంబర్, 2026
- Hyderabad: ఇంట్లో గడియ పెట్టుకుని బయటకు రాని లేడీ డాక్టర్.. తొంగి చూసి అంతా షాక్!
- కాళ్ల పారాణి ఆరకముందే తీరని విషాదం.. పాపం పెళ్లైన 6 రోజులకే వరుడు..
- పగలు భక్తులు.. రాత్రయితే దొంగలు.. దేవుడి సొమ్ము ఎలా దోచుకుంటున్నారో తెలుసా..?
- కారు కొనిచ్చి, రూ. 40 లక్షలు ఆర్థిక సహాయం.. ప్రియుడి చేసిన పనికి సాఫ్ట్వేర్ యువతి షాకింగ్ నిర్ణయం!





