వివాహం జరిగిన 4వ రోజే ఉరి కొయ్యకు వేలాడిందో నవ వధువు. పెళ్లిలో 5 తులాల నగలు ఇస్తామని చెప్పి.. 4 తులాల నగలు మాత్రమే ఇచ్చినందుకు కట్టుకున్నోడితోపాటు అత్తింటివారు నానాయాగి చేశారు. వరకట్నం కోసం వేధించారు. అత్తింటి వేధింపులు తాళలేక నవ వధువు ఆత్మహత్య చేసుకుంది..
తిరువళ్లూరు, జూలై 1: మృగాళ్ల వరకట్న వేధింపులకు మరో నిండు ప్రాణం బలైంది. వివాహం జరిగిన 4వ రోజే ఉరి కొయ్యకు వేలాడిందో నవ వధువు. పెళ్లిలో 5 తులాల నగలు ఇస్తామని చెప్పి.. 4 తులాల నగలు మాత్రమే ఇచ్చినందుకు కట్టుకున్నోడితోపాటు అత్తింటివారు నానాయాగి చేశారు. వరకట్నం కోసం వేధించారు. అత్తింటి వేధింపులు తాళలేక నవ వధువు ఆత్మహత్య చేసుకుంది. తిరువళ్లూరు జిల్లా పొన్నేరి గ్రామంలో ఈ దారుణ ఘటన చోటు చేసుకుంది. ప్రస్తుతం ఆ మహిళ భర్త పన్నీర్ మరియు అతని కుటుంబ సభ్యులను పోలీసులు విచారిస్తున్నారు. నిన్న అవినాశిలో ఒక మహిళ వరకట్న వేధింపుల కారణంగా ఆత్మహత్య చేసుకుంది.
తిరువళ్లూరు జిల్లా పొన్నేరి ప్రాంతానికి చెందిన లోకేశ్వరి (24), అదే నగరానికి చెందిన ముస్లిం పన్నీర్‌కు జూన్ 27న అంగరంగ వైభవంగా వివాహం జరిగింది. వివాహం అయినప్పటి నుంచి భర్త, అతని కుటుంబ సభ్యులు ఆమెను వేధింపులకు గురి చేశారు. అదనపు కట్నం డిమాండ్ చేస్తూ వారు ఆమెను వేధించినట్లు మృతురాలి బంధువులు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలో లోకేశ్వరి జూన్ 30న తన భర్తతో కలిసి తన తల్లి ఇంటికి వెళ్లింది. అదే రోజు రాత్రి లోకేశ్వరి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ విషయం తెలుసుకున్న తల్లి వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చింది. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు లోకేశ్వరి మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని శవపరీక్షకు తరలించారు. పొన్నేరి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
పెళ్లి కోసం పన్నీర్ కుటుంబం వధువు కుటుంబం నుంచి కట్నంగా 5 తులాల బంగారం అడిగారనీ, కానీ వధువు కుటుంబం 4 తులాలు మాత్రమే ఇచ్చారు. వివాహం అనంతరం కాపురానికి వెళ్లిన లోకేశ్వరిని.. పుట్టింటి నుంచి నగలు, బైక్, ఏసీ డిమాండ్ చేస్తూ అత్తింటి వారు హింసించసాగారు. వీరి వేధింపులు తాళలేక ఆత్మహత్య చేసుకున్న మృతురాలి కుటుంబం ఫిర్యాదులో పేర్కొంది. దీంతొ పోలీసులు పన్నీర్, అతని తండ్రి, తల్లిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. మరోవైపు జూన్ 30న వరకట్న వేధింపుల కారణంగా తిరుప్పూర్‌లో మరో మహిళ వివాహం అయిన 78 రోజుల తర్వాత ఆత్మహత్య చేసుకుంది. ఏప్రిల్ 2025లో వివాహం జరగగా.. కట్నంగా 800 గ్రాముల బంగారం, ఒక వోల్వో కారును కట్నంగా వధువు కుటుంబం ఇచ్చారు. అయితే కట్నం రుచిమరిగిన భర్త, అతని కుటుంబ సభ్యులు అదనపు కట్నం కోసం ఆమెను నిత్యం హింసించసాగారు. మానసికంగా కుంగిపోయిన ఆమె తండ్రికి ఆడియో సందేశం పంపి ఆత్మహత్య చేసుకుని తనువు చాలించింది. ఈ కేసులో భర్తతో సహా ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు.
Also read
- గ్లిజరిన్ వేసుకుని ఏడ్చినట్లు నమ్మించిందా?.. తేజేశ్వర్ హత్య కేసులో కొత్త అంశం
- Tadipatri: వేట కొడవలితో దాడి.. చికిత్స పొందుతూ యువకుడి మృతి
- Palnadu: పల్నాడు జిల్లాలో దారుణం.. కుమారుడిని చంపి కాలువలో పూడ్చేసిన తండ్రి
- Crime News: ప్రియుడితో కలిసి భర్తను చంపించి.. రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించి..
- నేటి జాతకములు..16 జూలై, 2025