July 5, 2024
SGSTV NEWS
Andhra PradeshPolitical

ఇక్కడ గోరంట్ల నెగ్గితే.. అక్కడ నిడదవోలులో నేను గెలుస్తా



– కందుల దుర్గేష్
-ఇద్దరు ఎమ్మెల్యేలు మీకోసమే
– గోరంట్ల
– కందుల నేతృత్వంలో కడియంలో జనసేన – తెలుగుదేశం ఆత్మీయ సమావేశం
– గోరంట్ల విజయానికి జనసైనికులంతా ఐక్యంగా కృషిచేయాలి
– అఖండ మెజారిటీతో గెలిపించండి.. దుర్గేష్ , నేను ఇద్దరు ఎమ్మెల్యేలు మీకోసం పనిచేస్తారు: గోరంట్ల
– ఆత్మీయంగా కలుసుకుని తమ అనుబంధాన్ని చాటుకున్న గోరంట్ల, కందుల

కడియం : కడియంలో జనసైనికుల మధ్య తెలుగుదేశం, జనసేన, బిజేపీ కూటమి అభ్యర్ధులు కందుల దుర్గేష్, గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఆత్మీయంగా కలుసుకున్నారు. ఇద్దరూ కలిసి తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి రూరల్ నియోజకవర్గ జనసైనికులకు భరోసా ఇచ్చారు. తెలుగుదేశం కంటే ఎక్కువగా జనసేనను చూసుకుంటానని రాజమండ్రి రూరల్ కూటమి అభ్యర్ధి గోరంట్ల స్పష్టం చేశారు. నియోజకవర్గాలు వేరైనా, పొత్తు ధర్మంలో నియోజకవర్గం మారినా, జనసేన నాయకులకు, కార్యకర్తలకు తాను ఎప్పుడూ అండగా వుంటానని దుర్గేష్ హామీ ఇచ్చారు.

జనసేన – తెలుగుదేశం ఆత్మీయ సమావేశం సోమవారం కడియంలోని జిఎన్ ఆర్ కళ్యాణమండపంలో రాజమండ్రి రూరల్ నియోజకవర్గ జనసేన ఇన్చార్జి తెలుగుదేశం, బిజేపీ, జనసేన నిడదవోలు అభ్యర్ధి కందుల దుర్గేష్ అధ్యక్షత వహించారు. సీట్లు ఖరారు అయిన తర్వాత నిడదవోలుకు వెళ్లిపోయి ఎన్నికల ప్రచారంలో నిమగ్నమైన కందుల దుర్గేష్ తొలిసారిగా ఈరోజు కడియంలో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. జనసైనికులతో గంటన్నరకు పైగా సమావేశంలో మాట్లాడి, నాయకుల అభిప్రాయాలను తెలుసుకుని, వారి ప్రశ్నలకు, అనుమానాలకు తగిన సమాధానాలు చెప్పారు దుర్గేష్.

జనసైనికులకు పొత్తు ధర్మంలో పవన్ ఆదేశాల మేరకే నిడదవోలు వెళ్లాల్సివచ్చిందని, అక్కడ నిడదవోలు టిడిపీ ఇన్ చార్జి మాజీ ఎమ్మెల్యే బూరుగుపల్లి శేషారావు తనను ఆత్మీయం ఆహ్వానించి ప్రచారంలో తనను ముందుకు నడిపిస్తున్నారని చెప్పారు. అనంతరం సమావేశానికి రాజమండ్రి రూరల్ తెలుగుదేశం, జనసేన, బిజేపీ కూటమి అభ్యర్ధి గోరంట్ల బుచ్చియ్యచౌదరిని ఆహ్వానించారు. గోరంట్ల సమావేశానికి హాజరుకాగానే దుర్గేష్ ఆత్మీయంగా ఆహ్వానించారు. ఒకర్నొకరు ఆత్మీయంగా పలకరించుకున్నారు.

కందుల దుర్గేష్ మాట్లాడుతూ రాజమండ్రిరూరల్ నియోజకవర్గంలో కూటమి నెగ్గాలని, జనసేన పార్టీని నిబెట్టుకోవాలని, ఖచ్చితంగా టీడీపి అభ్యర్దులు ఎక్కడ పోటీచేసినా జనసేన పూర్తి సహకరించి వారి విజయానికి కృషి చేయాలని విజ్నప్తిచేశారు. రాజమండ్రి రూరల్ లో సైకిల్ గుర్తుపై ఓటేసి పెద్దలు బుచ్చయ్యచౌదరి ని, కమలం గుర్తుపై ఓటేసీ ఎంపీ అభ్యర్తి పురంధేశ్వరిని గెలిపించి తీరాలని జనసైనికులకు వివరించారు. గెలిపించి తీరాలి. ఉమ్మడి అభ్యర్ధి గా భావించాలి.

రాజమండ్రి రూరల్ లో గోరంట్ల విజయానికి ఇక్కడ చేసిన కృషి నిడదవోలు లో తన విజయానికి దోహదపడుతుందని దుర్గేష్ అన్నారు. ఖచ్చితంగా ఓట్లు ట్రాన్స్ఫర్ అవ్వాలని,. ఏమైనా ఇబ్బందులు వున్నా ప్రక్కన పెట్టి కూటమి అభ్యర్ధుల విజయమే లక్ష్యంగా పనిచేయాలని విజ్నప్తిచేశారు. అనుకున్న, ఆశించిన చోట టిక్కెట్ రానప్పుడు బాధ అందరికీ వుంటుందని ఇలాంటి పరిణామం రాజమండ్రిరూరల్ లో మీకుంటే, అక్కడ నిడదవోలులో బూరుగుపల్లి వర్గానికి బాధ వుందని, అయితే అవన్నీ ఇప్పుడు సర్ధుకుని గెలుపే ప్రధానంగా పనిచేస్తున్నామని, బూరుగుపల్లి ముందుండి నడిపిస్తున్నారని కందుల అన్నారు.

రాజమండ్రి రూరల్ వచ్చే సరికి జనసేన ఇన్చార్జి గానే వుంటానని, . ఇక్కడ బుచ్చయ్య గారిని గెలిపించాలని, అలాగే నిడదవోలు లో మీ బంధువులు తో చెప్పి తనకు ఓట్లు వేయించి గెలిపించాలని కందుల కోరారు.

నేను కలవపోవడానికి కారణం ఇదే – గోరంట్ల బుచ్చయ్య చౌదరి

తాను గత పక్షంరోజులుగా మిమ్మల్ని తాను కలవపోవడానికి కారణం ఒక్కటేనని, రాజమండ్రిరూరల్ నుంచి నిడదవోలు వెళ్లిన కందుల దుర్గేష్ అక్కడ సర్ధుకున్న తర్వాతే కలుద్దామనే ఉద్దేశ్యం తప్ప మరో విషయంకాదని రాజమండ్రిరూరల్ నియోజకవర్గ సిట్టింగ్ ఎమ్మెల్యే , జనసేన, తెలుగుదేశం, బిజేపీ కూటమి అభ్యర్ధి గోరంట్ల బుచ్చయ్య చౌదరి అన్నారు.

చాలా మంది తానింకా కలవకపోవడంపై ప్రశ్నించారని, అయితే దుర్గేష్ ను ముందే కోరానని, మీరొచ్చి సమావేశం నిర్వహించాకే కలుస్తానని చెప్పానని, అందుకే ఈ జాప్యం జరిగిందని గోరంట్ల వివరించారు. అత్యధిక మెజారిటీ తో నిడదవోలు లో కందుల దుర్గేష్ గెలుస్తున్నారని, టీడీపి, జనసేన రెండూ వేర్వేరు కాదని, రెండూ శానపట్టినట్టుగా ఒక్కటేనని అన్నారు. తనకు గ్రూపులు, వర్గాలు వుండవని అందర్నీకలుపుకుని వెళ్లడమే తన లక్ష్యం అన్నారు. .

జనసేన అధినేత పవన్ చొరవతీసుకొని పొత్తులు ఏర్పాటు చేశారని, తనదే ఓకే మాట అని జనసేనకు తెలుగుదేశంతో సమానంగా ప్రాధాన్యత ఇస్తాను అన్నారు.వైసీపీ దుష్ట పాలనను పారద్రోలాలని, అరాచక పాలనకు అడ్డుకట్ట వేయాలని, అందుకే అందర్నీ కలుపుకొని ముందుకు వెళుతున్నామని టీడీపీ, జనసేన ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్నాం అని గోరంట్ల అన్నారు.

ఇసుక దోపిడీ దారుణం గా జరిగిపోతుందన్నారు. నేను కందుల .మీకు ఇద్దరు ఎమ్మెల్యేలుగా పని చేస్తామని, అసెంబ్లీకి రెండు పులులు గా తాము వెళ్ళబోతున్నాం అన్నారు. రాజకీయంగా, పరిపాలనా పరంగా మంచి అవగాహన వున్న మంచి నాయకుడు కందుల దుర్గేష్ అని , రాబోయే భవిష్యత్ పవన్ దేనని గోరంట్ల అన్నారు.

రాజమండ్రి రూరల్ లో సైకిల్ కు, కమలం గుర్తుకే ఓటేయాలని జనంలోకి తీసుకెళ్లాలని జనసేన, టిడిపీ శ్రేణులకు ఆయన పిలుపునిచ్చారు. . సొంత మనుషులే తరిమి వేసిన నాయకుడు రాజమండ్రి రూరల్ నియోజకవర్గంలో పోటీకి వచ్చారని, విమర్శించారు.రాష్ట్రంలో తెలుగుదేశం, జనసేన ఉమ్మడి ప్రభుత్వమే రాబోతుందని,కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వం రాబోతుందని గోరంట్ల చెప్పారు.

పెద్ద సంఖ్యలో జనసైనికులు సమావేశానికి హాజరయ్యారు. జనసేన నాయకులు జమ్మి, గట్టి నర్సయ్య, రవి, పుల్లా రామారావు , టిడిపీ నేతలు వెలుగుబంటి ప్రసాద్, మత్సేటి ప్రసాద్, దొంగ శ్రీనివాసరావు, ఆళ్ల ఆనంద్, వెలుగుబంటి నాని, అన్నందేవుల చంటి , కిషోర్ తదితరులు పాల్గొన్నారు

Also read

Related posts

Share via