రైల్వే కోడూరు స్థానిక రాజకీయాల్లో సంచలనం రేపుతూ బాధితురాలు హర్షవీణ పోలీసులను ఆశ్రయించారు. తనకు తన కుటుంబానికి ప్రాణహాని ఉందంటూ ఆమె ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదులో ఎమ్మెల్యే అరవ శ్రీధర్ తో పాటు టీడీపీ నేత రూపానందరెడ్డి అలాగే నాగేంద్ర పేర్లను ఆమె ప్రధానంగా ప్రస్తావించారు. తనకు న్యాయం చేయాలని కోరుతూ పోలీసులకు విన్నవించుకున్నారు. న్యాయవాదితో కలిసి పోలీసులకు హర్షవీణ ఫిర్యాదు చేశారు. ఈ మేరకు నాగేంద్రతోపాటు మరికొందరిపైనా పోలీసులు ఎస్సీ, ఎస్టీ కేసులను నమోదు చేసినట్టు తెలుస్తోంది.
కోడూరు నియోజకవర్గంలో తనకు రక్షణ కరువైందని హర్షవీణ ఆవేదన వ్యక్తం చేశారు. గత కొంతకాలంగా వేధింపులు పెరిగాయని ఆమె పేర్కొన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో తమ కుటుంబం తీవ్ర భయాందోళనల మధ్య గడుపుతోందని తెలిపారు. పోలీసులు సైతం తమకు రక్షణ కల్పించడంలో భాగంగా ఇంటి దగ్గర సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించినట్లు ఆమె వెల్లడించారు. ఒక సామాన్యురాలిగా తనకు రక్షణ కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని ఆమె డిమాండ్ చేశారు.
కేవలం తన కుటుంబానికే కాకుండా తన తరఫున వాదిస్తున్న లాయర్ కుటుంబానికి కూడా ముప్పు పొంచి ఉందని హర్షవీణ ఆందోళన చెందారు. రాజకీయ పలుకుబడి ఉన్న వ్యక్తులు కావడంతో తమను ఏ క్షణమైనా ఏదైనా చేయవచ్చని ఆమె భయపడుతున్నారు. ఈ వివాదంలో ఎమ్మెల్యే అరవ శ్రీధర్ తో పాటు రూపానందరెడ్డి ప్రమేయం ఉందని ఆమె స్పష్టంగా ఆరోపించారు. తనకు ఏ హాని జరిగినా వీరిద్దరే బాధ్యత వహిస్తారని ఆమె పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు.
తమకు వీరిద్దరు తప్ప మరెవరు శత్రువులు లేరని హర్షవీణ చెప్పారు. వ్యక్తిగత కక్షలతోనే తమను టార్గెట్ చేస్తున్నారని ఆమె వాపోయారు. ప్రజాప్రతినిధులుగా ఉండి రక్షణ కల్పించాల్సింది పోయి భయభ్రాంతులకు గురి చేయడం తగదని ఆమె విమర్శించారు. ఈ కేసును నిష్పక్షపాతంగా విచారించి తమకు భద్రత కల్పించాలని ఆమె కోరారు.
Also read
- భవన నిర్మాణ కార్మికుల కు కూటమి ప్రభుత్వ వెన్నుపోటు….. గ్రీష్మ కుమార్, ఐ.యఫ్.టి.యు రాష్ట్ర కమిటీ సభ్యులు.
- ఛీ ఛీ.. నువ్వేం మనిషివిరా.. భార్యపై కోపంతో కూతురిని చంపాడు.. బైక్‌పై తీసుకెళ్లి..
- విశాఖలో యువతి అనుమానాస్పద మృతి… పార్టీ నుంచి లాడ్జి వరకు ఏమైంది?
- ఉద్యోగం అన్నాడు.. ప్రేయసి నుంచి రూ.18 లక్షలు కాజేశాడు.. కట్‌చేస్తే..
- అడుగు భూమికోసం ఇంత దారుణమా.. ఈ బుడ్డోడు ఏం చేశాడో తెలిస్తే..





