హైదరాబాద్ లో మరోసారి నడిరోడ్డు పై కామాంధులు రెచ్చిపోయారు. “నన్నే నీ మొగుడు అనుకో, నంబర్ ఇవ్వు” అంటూ కట్టుకున్న భర్త ముందే అసభ్యంగా ప్రవర్తించారు. బీరు బాటిళ్లతో బెదిరింపులకు దిగారు. బేగంపేట నుంచి రహ్మత్ నగర్ వరకూ వెనుకపడుతూ వేధింపులకు పాల్పడ్డారు.
Hyderabad Crime: హైదరాబాద్ లో మరోసారి నడిరోడ్డు పై కామాంధులు రెచ్చిపోయారు, మహిళలపై అసభ్యంగా ప్రవర్తిస్తూ దాడికి దిగారు. ఓ వివాహిత తన భర్తతో కలిసి రాత్రి సమయంలో ఇంటికి తిరిగివస్తుండగా ముగ్గురు యువకులు బీరు సీసాలతో ఆమెను బెదిరిస్తూ బలాత్కారం చేయబోయారు. ఈ దారుణ ఘటన మధురానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది
వివరాల్లోకి వెళితే, ఆంధ్రప్రదేశ్, ఒంగోలుకు చెందిన 29 ఏళ్ల మహిళ తన భర్త, మరిది, ఆడపడుచుతో కలిసి హైదరాబాద్‌లోని రహ్మత్ నగర్‌కు బంధువుల ఇంటికి వెళ్లారు. వీరంతా కలిసి గురువారం సాయంత్రం బేగంపేటలోని క్లబ్ – 8 పబ్‌కు వెళ్లి రాత్రి సుమారు 11:40 గంటలకు తిరిగి ఇంటికి బయలుదేరారు.
“నన్నే నీ భర్త అనుకో, నంబర్ ఇవ్వు”
అయితే పబ్ నుండి బయటకు వస్తున్న సమయంలో ముగ్గురు యువకులు ఆమెను గమనించి వెంటాడారు. భర్తతో కలిసి వస్తున్నానని చెప్పినా, వారిలో ఒకడు “నన్నే నీ భర్త అనుకో, నంబర్ ఇవ్వు” అంటూ అసభ్యంగా ప్రవర్తించాడు. బీరు బాటిళ్లతో బెదిరింపులకు దిగారు. బేగంపేట నుంచి రహ్మత్ నగర్ వరకూ వారి వెనుకపడుతూ వేధింపులకు పాల్పడ్డారు
ఈ క్రమంలో భర్త తన భార్యను ఇంటికి చేర్చి స్నేహితుడిని డ్రాప్ చేయడానికి బయలుదేరాడు. అయితే ఎస్‌ఆర్ నగర్ మెట్రో స్టేషన్ సమీపంలో మళ్లీ అదే ముగ్గురు యువకులు దాడికి దిగారు. వారు ప్రయాణిస్తున్న బైక్ ను అడ్డగించి, ఫోన్లను బలవంతంగా లాక్కున్నారు. వెంటనే బాధితులు డయల్ 100 సహాయంతో పోలీసులకు సమాచారం అందించగా, స్పందించిన మధురానగర్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ముగ్గురు యువకులను అదుపులోకి తీసుకున్నారు.
అరెస్టు చేసిన వారి వివరాలు ఇలా ఉన్నాయి.. పంజాగుట్టకు చెందిన సంపత్ (28), సందీప్ (28), కూకట్‌పల్లికి చెందిన ఉమేష్ (28). వీరిపై కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు
ఇలాంటి ఘటనలు భాగ్యనగర భద్రతపై ప్రశ్నలు కలిగిస్తుండగా, మహిళల రక్షణ కోసం మరింత చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని స్పష్టంగా కనిపిస్తోంది. ఇలాంటి సంఘటనలు జరగకుండా తగిన చర్యలు చేపట్టాలని బాధితులు పోలీసు వారిని కోరారు.
Also read
- నేటి జాతకములు…11 జూలై, 2025
- Hindu Epic Story: స్వర్గాధికధిపతి ఇంద్రుడు ఒళ్ళంతా కళ్ళే.. ఈ శాపం వెనుక పున్న పురాణ కథ ఏమిటంటే..
- Vipareeta Raja Yoga: నెల రోజులు చక్రం తిప్పేది ఈ రాశులవారే..! ఇందులో మీ రాశి ఉందా?
- నా లాగా ఎవరూ మోసపోవద్దు.. కుమారుడు జాగ్రత్త.. అయ్యో అనూష
- Andhra: వదినపై కన్నేసి సెట్ చేశాడు.. కానీ, మరిది అడ్డుగా ఉన్నాడని.. మాస్టర్ స్కెచ్.. చివరకు