హైదరాబాద్: ఐటీ కారిడార్లో బొమ్మ తుపాకీ చూపించి దోచుకున్న ఘటన కలకలం రేపింది. రాయదుర్గం పీఎస్ పరిధిలోని నాలెడ్జ్ సిటీలోని తేవర్ బార్లో దోపిడీ జరిగింది. బొమ్మ తుపాకీతో బార్ సెక్యూరిటీ గార్డును బెదిరించడమే కాకుండా రూమ్లో బందించి నాలుగు లక్షల యాభై వేల రూపాయల నగదు, ఒక ఐ ప్యాడ్,ఒక ఆపిల్ ల్యాప్టాప్ను దుండగులు దోచుకెళ్లారు.
దోపిడీకి పాల్పడిన ఇద్దరిలో ఏ1 నిందితుడు శుభమ్కుమార్ను పోలీసులు అరెస్టు చేశారు. ఏ2 నిందితుడు విశ్వజిత్ పండా పరారీలో ఉన్నాడు. ఒడిశాకు చెందిన నిందితులిద్దరూ గతంలో తేవర్ బార్ లో పనిచేశారు. మూడు నెలల క్రితం ఈ ఇద్దరినీ బార్ ఓనర్ పనిలో నుంచి తీసివేశాడు. ఇది మనసులో పెట్టుకునే దోపిడీకి పాల్పడ్డారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
Also read
- Astro Tips for Marriage: గ్రహ శాంతి పూజ అంటే ఏమిటి? వివాహానికి ముందు గ్రహ శాంతి పూజను ఎందుకు చేస్తారో తెలుసా..
- శివ శక్తి రేఖ: పూర్వీకుల మేధస్సుకి చిహ్నం ఈ 8 శివాలయాలు.. ఒకే రేఖాంశం పై నిర్మాణం..
- మీరు వచ్చే జన్మలో ఎలా పుట్టనున్నారు.? మీరు చేసే పనులే ఆ విషయం చెబుతాయి..
- నేటి జాతకములు…8 డిసెంబర్, 2025
- ఒకరితో ప్రేమ… మరొక అమాయకుడితో పెళ్లి!





