ఎవరైనా భర్త.. తన భార్య అందంగా ఉండాలని అనుకుంటాడు. అందమైన అమ్మాయిని చూసి పెళ్లి చేసుకుంటాడు. కానీ, ఇక్కడో భర్త.. తన భార్య అందంగా ఉందన్న కారణంగా ఆమె ముక్కును కొరుక్కుని తిన్నాడు. ఈ వింత దారుణ ఘటన పశ్చిమ బెంగాల్ చోటుచేసుకుంది. అర్థరాత్రి సమయంలో జరిగిన ఈ ఘటనతో ఆ భార్య భయపడిపోయింది. బాధతో గట్టిగా కేకలు వేసింది.

వివరాల ప్రకారం.. నదియా జిల్లాలోని శాంతీపుర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బేర్పారా ప్రాంతంలో బాపన్ షేక్, మధు ఖాతూన్ అనే దంపతులు నివసిస్తున్నారు. తొమ్మిదేళ్ల క్రితం వీరిద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వారికి ఎనిమిదేళ్ల కూతురు కూడా ఉంది. ఈ నెల 2వ తేదీ తెల్లవారుజామున అర్ధరాత్రి మూడు గంటలకు బాపన్ షేక్ ఇంట్లో ఒక్కసారిగా అలజడి రేగింది. తన భార్య మధు ఖాతూన్ ముక్కును భర్త కొరికి నమిలేశాడు. దీంతో బాధను తట్టుకోలేక మధు ఖాతూన్ గట్టిగా కేకలు వేసింది. బయటకు పరుగులు తీసింది. అయితే ఆమె వెంటబడిన భర్త.. వేలును కూడా కొరికే ప్రయ్నతం చేశాడు. ఈ క్రమంలో ముక్కూ, వేలికి తీవ్రగాయాలయ్యాయి.
అనంతరం, భర్త నిర్వాకంపై మధు ఖాతూన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. తల్లి రేష్మా బేగంతో కలిసి పోలీస్ స్టేషన్కు వెళ్లిన మధు ఖాతూన్ భర్త మీద పోలీసులకు ఫిర్యాదు చేసింది. తనకు అవకాశం దొరికితే ముక్కును కొరికి తినేస్తానని నా భర్త అనేవాడు. చివరకు అన్నంత పనీ చేశాడని ఆమె తన ఫిర్యాదులో పేర్కొంది. మరోవైపు తాను అందంగా ఉండటంతో ముఖంపై యాసిడ్ పోస్తానని తాగిన మత్తులో తన భర్త బెదిరించేవాడని పోలీసులకు బాధితురాలు తెలిపింది. దీంతో, అతడిపై పోలీసులు కేసు నమోదు చేశారు. అనంతరం బాపన్ షేక్ను అరెస్టు చేసి కోర్టులో పరిచారు. ఇక, ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.
Also read
- నేటి జాతకములు..24 జనవరి, 2026
- Crime News: ఎంతకు తెగించార్రా.. ఆ పని తప్పని చెప్పిన పాపానికి.. ఇంతలా వేధిస్తారా?
- దారుణం.. విషం తాగి ఫ్యామిలీ మాస్ సూసైడ్! ముగ్గురు మృతి
- Crime News: ఎవడు మమ్మీ వీడు.. ప్రేయసి ముక్కు కోసి ఎత్తుకెళ్లిన ప్రియుడు.. ఎందుకో తెలిస్తే
- Medak: ప్రేమ పెళ్లి.. పేరెంట్స్ను కౌన్సిలింగ్కు పిలిచిన పోలీసులు.. ఆపై ఊహించని సీన్..





