కరీంనగర్ పట్టణంలోని సుభాష్ నగర్‌లో నివసించే తోట హేమంత్, రోహితీ దంపతుల మధ్య ఇటీవల తరచుగా గొడవలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే భర్తను కట్టేసి అతి దారుణంగా కొట్టి హింసించింది భార్య. పైగా ఏం తెలియదన్నట్లు ఆసుపత్రికి తరలించి చికిత్స చేయించేందుకు ప్రయత్నించింది.
భార్యాభర్తల మధ్య కొట్టుకోవడం, తిట్టుకోవడం సహజంగా జరుగుతుంటాయి. కానీ ఇటీవల కాలంలో శృతిమించుతూ, ఒకరినొకరు హింసించడం, చంపుకోవడం వంటి తీవ్ర పరిణామాలకు దారి తీస్తున్నాయి. ఇలాంటి సంఘటనే కరీంనగర్ జిల్లాలో తాజాగా చోటు చేసుకుంది. భర్తను కట్టేసి అతి దారుణంగా కొట్టి హింసించింది భార్య. పైగా ఏం తెలియదన్నట్లు ఆసుపత్రికి తరలించి చికిత్స చేయించేందుకు ప్రయత్నించింది. అక్కడ చికిత్స అతడు ప్రాణాలు విడిచినట్లు వైద్యులు తెలిపారు
కడదాకా కలిసి తోడు ఉండాల్సిన భార్యే.. కట్టుకున్న వాడిని కడతేర్చింది. భర్తను కట్టేసి వేడి నీళ్లు పోసి మరీ కొట్టి చంపింది. మరో ఇద్దరి సహకారం తో ఈ హత్య చేసినట్లు మృతుడు తల్లి ఆరోపిస్తున్నారు. కరీంనగర్ పట్టణంలోని సుభాష్ నగర్‌లో నివసించే తోట హేమంత్, రోహితీ దంపతుల మధ్య ఇటీవల తరచుగా గొడవలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే బుధవారం రాత్రి పదిన్నర గంటలకు హేమంత్‌ను రోహితీ దారుణంగా కొట్టి ఆస్పత్రికి తీసుకువెళ్లింది. అక్కడ చికిత్స పొందుతూ అర్ధరాత్రి మరణించాడు హేమంత్. సమాచారం తెలుసుకున్న త్రీ టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. అయితే రోహితీ ఇద్దరు వ్యక్తుల సాయంతో తమ కొడుకును కట్టేసి కొట్టారని హేమంత్ తల్లి ఆరోపిస్తుండటంతో అసలేం జరిగింది హత్య వెనుక ఎవరెవరు ఉన్నారనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి..
గత కొన్ని రోజుల నుంచి భార్య, భర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయి. పంచాయతీ కూడా నిర్వహించారు. అయినా ఇద్దరి మధ్య గొడవలు తగ్గలేదు. ఈ క్రమంలోనే మరోసారి గొడవ జరగడంతో పథకం ప్రకారం దాడి చేసింది భార్య. తీవ్ర గాయాలు కావడంతో భార్యనే ఆసుపత్రలో చేర్పించారు. హేమంత్ చికిత్స పొందుతు చనిపోయారు. అయితే తన కొడుకును కట్టేసి.. తన నోట్లో గుడ్డలు పెట్టారని మృతుడి తల్లి ఆరోపిస్తోంది. ఈ మేరకు చర్యలు తీసుకోవాలంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. బండతోపాటు రాడుతో కొట్టారని, దాడి చేసిన తరువాత ఆసుపత్రికి తీసుకెళ్లారని హేమంత్ తల్లి విమల చెబుతోంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ప్రస్తుతం నిందితురాలితో పాటు మరో ఇద్దరు పోలీసుల అదుపులో ఉన్నారు.
Also read
- పరారీలో అఘోరి, శ్రీ వర్షిణి.. ఫోన్లు స్విచ్చాఫ్- ఆ భయంతోనే జంప్!
- విహారయాత్రలో విషాదం – విద్యార్ధి మృతి
- Wife Murder: మరో భయంకరమైన భార్య మర్డర్.. ఛార్జర్ వైర్‌తో గొంతు కోసి, పిల్లలను గదిలో బంధించి!
- Telangana: విషాదం.. ఇంజక్షన్ వికటించి వ్యక్తి మృతి.. !
- Khammam Crime: ఖమ్మంలో కసాయి కోడలు.. మామ కంట్లో కారం చల్లి.. ఏం చేసిందంటే!