వరంగల్ జిల్లా కోర్టును ఆకతాయిలు టార్గెట్ చేశారు. బాంబు బెదిరింపు కాల్స్‌తో న్యాయవాదులు, పోలీసులను పరుగులు పెట్టిస్తున్నారు. ఫిబ్రవరి నెల 26వ తేదీన బాంబు పెట్టామని కోర్టులో సిబ్బందిని వణికించిన ఆకతాయిలు తాజాగా మరోసారి అదే బాంబు కాల్‌తో బెంబేలెత్తించారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు బాంబ్ స్క్వాడ్‌తో తనిఖీలు చేపట్టారు.
కోర్టులకు బాంబ్ బెదిరింపులు ఆగడం లేదు. తాజాగా మరోసారి హనుమకొండ అదాలత్‌లోని వరంగల్ జిల్లా కోర్టులో టెన్షన్ వాతావారణం నెలకొంది.. జిల్లా కోర్టుకు బాంబు బెదిరింపులు వచ్చాయి. గుర్తు తెలియని ఆగంతకుడు బాంబ్ పెట్టామని మెయిల్ ద్వారా సందేశం పంపాడు. దీంతో అప్రమత్తమైన కోర్టు సిబ్బంది పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే స్పందించిన పోలీసులు, బాంబ్ స్క్వాడ్, ఫైర్ సిబ్బందితో కలిసి కోర్టుకు చేరుకున్నారు. కోర్టు పరిసర ప్రాంతాలను బాంబు స్క్వాడ్ బృందాలు క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించారు.
బాంబ్ బెదిరింపు మెయిల్ తో జిల్లా కోర్టు ఆవరణలో కొంతసేపు టెన్షన్ వాతావారణం నెలకొంది. దాదాపు గంటకు పైగా ఉద్రిక్తత నెలకొంది. కోర్టు పరిసరాల్లో విస్తృతంగా తనిఖీలు చేపట్టిన బాంబ్ స్క్వాడ్ ఫేక్ కాల్ అని తేల్చారు. ఎలాంటి బాంబ్ లేదని తేలడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. కోర్టులో బాంబు పెట్టామని మెయిల్ సందేశం పంపిన ఆగంతకుడి కోసం పోలీసులు ఆరా తీస్తున్నారు. ఉద్దేశపూర్వకంగా ఆట పట్టిస్తున్నారా..? లేక ఎవరైనా అగంతకులు కోర్టులను టార్గెట్ చేశారా..? అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. పోలీసులు ఆ అజ్ఞాత వ్యక్తుల కోసం విచారణ జరుపుతున్నారు.
Also read
- Hyderabad: అతన్ని గుడ్డిగా నమ్మింది.. హోటల్‌కు వెళ్లింది.. కట్‌చేస్తే.. అసలు మ్యాటర్ తెలిసి..
- అగస్త్య మహర్షి ప్రతిష్ఠించిన శివలింగం- ప్రొద్దుటూరులో అరుదైన నవగ్రహ మండపం విశేషాలివే!
- తల్లి మృతిని తట్టుకోలేక.. భార్యను చంపి భర్త ఆత్మహత్య
- లాయర్ అయితే నాకేంటి.. చంపకుండా ఇక్కడి నుంచి వెళ్లను!’
- రోడ్డు ప్రమాదంలో ట్రాఫిక్ డీసీపీ కుమార్తె మృతి




