హైదరాబాద్: మాట్లాడే పని ఉందని చెప్పి హోటల్‌కు పిలిచి యువతిపై లైంగిక దాడికి పాల్పడిన ఫుడ్ డెలివరీ బాయ్‌ను జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్టు చేశారు. పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం.. మల్లేపల్లికి చెందిన ఒబేదుల్లాఖాన్ (23) ఫుడ్ డెలివరీ బాయ్. ఎనిమిది నెలల క్రితం లక్డీకాపూల్‌లో ఓ సెమినార్‌కు హాజరైన ప్రైవేటు ఉద్యోగిని (22) ఫుడ్ ఆర్డర్ చేయడంతో ఒబేదుల్లా ఆమెకు అందజేశాడు. ఆమె డబ్బులను గూగుల్ పే చేయడంతో ఆ నంబర్ తీసుకున్న ఒబేదుల్లా ఆమెతో ఫోన్లో మాట్లాడుతూ పరిచయం పెంచుకున్నాడు.
కేపీహెచ్‌బీ కాలనీలోని ఓ ప్రైవేటు హాస్టల్లో ఉండే సదరు యువతి ఒబేదుల్లాకు సన్నిహితమైంది. ఇదే అదనుగా భావించినన ఒబేదుల్లా గురువారం రాత్రి మాట్లాడే పని ఉందని ఆమెను తన బైక్‌పై తీసుకుని బంజారాహిల్స్‌లోని ఓయో రూమ్‌కు వచ్చాడు. రాత్రి ఒంటి గంట తర్వాత ఆమె నిద్ర మత్తులో ఉండగా లైంగిక దాడికి పాల్పడ్డాడు. శుక్రవారం ఉదయం బాధితురాలు జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. నిందితుడిపై ఐపీసీ 376, 354, 354 (ఏ), డి, 376, 66 (ఇ) సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి అరెస్టు చేశారు
Also read
- Today Horoscope: ఈరోజు పన్నెండు రాశులకు ఎలా ఉంటుంది? మీ రాశి ఫలాలు చూసుకున్నారా?
- అమావాస్య రోజే దీపావళి ఎందుకు? దీపాలు వెలిగించడం వెనుక అసలు రహస్యం ఇదే!
- Diwali: దీపావళి రోజు ఎన్ని దీపాలు వెలిగించాలి? 5, 11, 21, 51, 108 వెనుక ఉన్న ఆధ్యాత్మిక రహస్యం ఇదే
- ‘నువ్వు చస్తే మరో అమ్మాయిని పెళ్లి చేసుకుంటా’
- Telangana: చిల్లర విషయంలో ప్రయాణికురాలితో గొడవ.. బస్సులోంచి పడిపోయిన కండక్టర్ ప్రవళిక మృతి





