నేను నిన్ను పెళ్లి చేసుకోవడానికి మాత్రమే ఒప్పకున్నాను. పిల్లలను కనడానికి కాదు. పిల్లలు పుడితే నా అందం చెడిపోతుంది. అవసరమైతే పిల్లలను దత్తత తీసుకుందాం అంటూ ఓ భార్య తన భర్తను గత రెండేళ్లుగా వేధిస్తుంది. ఈ ఘటన బెంగళూరులో జరిగింది.
నేను నిన్ను పెళ్లి చేసుకోవడానికి మాత్రమే ఒప్పకున్నాను. పిల్లలను కనడానికి కాదు. పిల్లలు పుడితే నా అందం చెడిపోతుంది. అవసరమైతే పిల్లలను దత్తత తీసుకుందాం అంటూ ఓ భార్య తన భర్తను గత రెండేళ్లుగా వేధిస్తుంది. ఈ ఘటన బెంగళూరులో జరిగింది. దీంతో విసుగు చెందిన అతను తన భార్యపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం శ్రీకాంత్, బిందుశ్రీ రెండేళ్ల క్రితం వివాహం చేసుకున్నారు. వారు తమ హనీమూన్ కోసం దేశంలోని వివిధ ప్రాంతాలకు వెళ్లారు. కాశ్మీర్ కు కూడా వెళ్ళిన ఆ జంటకు ఇంకా పిల్లలు పుట్టలేదు
బ్లాక్ మెయిల్ చేసి బెదిరింపులు
భార్య బిందుశ్రీ తన భర్తను బలవంతంగా తాకితే చనిపోతానని డెత్ నోట్ రాసి మరి బ్లాక్ మెయిల్ చేసింది. భార్య ప్రవర్తనతో విసిగిపోయి నరకం అనుభవించాడు శ్రీకాంత్. భార్య మారుతుందని ఆశపడ్డాడు. కానీ ఆమెలో ఎలాంటి మార్పు రాలేదు. పెళ్లి చేసుకుని రెండు సంవత్సరాలు అయింది… పిల్లలు ఎప్పుడని ఇంట్లో వాళ్లు, బంధువులు అడిగితే సమాధానం చెప్పడానికి శ్రీకాంత్ చాలా ఇబ్బంది పడేవాడు. బిందుశ్రీని పెళ్లి చేసుకోవడానికి లక్షల రూపాయలు ఖర్చు కూడా చేసుకున్నాడు శ్రీకాంత్. తనను ముట్టుకుంటే చనిపోతానని.. మీకు అంతగా శృంగారం కావాలని అనిపిస్తే వెళ్లి ఎవరితోనైనా పడుకోవచ్చు అంటూ తన భార్య చెబుతుందని శ్రీకాంత్ వాపోయాడు. భార్యపై చాలా విసిగిపోయిన శ్రీకాంత్ శ్రీకాంత్ మల్లేశ్వరం సమీపంలోని వైలికావల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు.
Also Read
- గరుడపురాణం ప్రకారం ఆత్మ నరకలోక ప్రయాణంలో 8వ పట్టణం విచిత్రభవనం చేరుకోవడానికి ఎన్ని కష్టాలు పడుతుందో తెలుసా..?
- నేటి జాతకములు..2 మే, 2026
- చెడు కొలెస్ట్రాల్‌ను సహజంగా కరిగించే.. బెస్ట్ డ్రింక్స్ ఇవే!
- Andhra Pradesh: అయ్యో పాపం రాహుల్.. తల్లిదండ్రుల కళ్ల ముందే ప్రాణాలు విడిచి..
- ఎన్నడూ చూడని దృశ్యం.. 20 అడుగుల కొండచిలువ ఎలా చెట్టు ఎక్కుతుందో చూడండి..





