జంగారెడ్డిగూడెం: తన భార్యను ఓ యువకుడు లైంగికంగా వేధిస్తున్నారని ఓ భర్త శుక్రవారం పోలీసులను ఆశ్రయించాడు.
వివరాల ప్రకారం ఫిర్యాదుదారుడు తన కుటుంబసభ్యులతో కలిసి జంగారెడ్డిగూడెంలో నివాసం ఉంటున్నాడు. అయితే తన ఇంటి సమీపంలో ఉన్న ఓ వ్యక్తి ఫిర్యాదుదారిడి భార్యను లైంగికంగా వేధిస్తున్నాడు. ఈ విషయాన్ని ఎవరికైనా చెబితే అక్రమ సంబంధం ఉందని ప్రచారం చేస్తానని బెదిరిస్తున్నాడు.
ఈ విషయాన్ని భార్య భర్తకు చెప్పడంతో ఈ నెల 7న రాత్రి ఫిర్యాదుదారుడు ఆ యువకుడిని పిలిచి మాట్లాడుతుండగా ఒక్కసారిగా ఆ యువకుడు దాడికి యత్నించాడు. దాడి సమయంలో యువకుడి బావమరిది కూడా సహకరించాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు హెచ్సీ టి. బాబూరావు తెలిపారు.
Also read
- అమెరికా వీసా రాక యువతి ఆత్మహత్య
- తల్లితో వివాహేతర సంబంధం.. కూతురుపై అత్యాచారం..!
- Andhra: రేయ్.. ఏంట్రా ఇది.. బయట బోర్డేమో ఒకటి.. లోపల మాత్రం కథ వేరు.. అనుమానం వచ్చి వెళ్లగా..
- AP Crime: నెల్లూరులో దారుణం.. మహిళను వేధించాడు.. నడి రోడ్డుపై నరికారు
- నేటి జాతకములు….14 ఆగస్టు, 2025