హైదరాబాద్: గుర్తుతెలియని వ్యక్తి ఓ యువతిపై కత్తితో దాడి
చేసి పారిపోయాడు. మలక్‌పేట ఇన్స్పెక్టర్ వెంకట్‌రెడ్డి తెలిపిన వివరాలు… సూర్యాపేట జిల్లా అర్వపల్లి మండలం పర్సాయిపల్లికి చెందిన హేమలత(34) గడ్డిఅన్నారం ఏ1 పకోడా ఎదురుగా ఉన్న ఓ అపార్ట్మెంట్లో ఫ్లాట్ అద్దెకు తీసు కుని మరో నలుగురు అమ్మాయిలతో కలిసి గ్రూప్ పరీక్షలకు సన్నద్ధమవుతోంది. తోటివారు బయటికి వెళ్లగా ఆమె గదిలో చదువుకుంటోంది.
గుర్తుతెలియని వ్యక్తి వచ్చి తలుపు తట్టాడు. పక్క పోర్షన్ వారికి ఫుడ్ డెలివరీ తెచ్చానని, దాహం వేస్తోందంటూ మంచినీళ్లు అడిగాడు. నీళ్లు తాగిన తర్వాత ఆమె ను తాకేందుకు యత్నంచగా నెట్టివేసింది. కత్తితో ఆమె కడుపులో పొడిచి, సెల్‌ఫోన్ తీసుకుని పరారయ్యాడు. పొరుగువారు ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు వచ్చి ఆమెను మలక్‌పేటలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. బాధితురాలి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. నిందితుడి జాడ కోసం పోలీసులు సీసీ ఫుటేజీలను పరిశీలిస్తున్నారు.
Also read
- మంచినీళ్లు అడిగాడు.. కత్తితో పొడిచాడు
- మేము తప్పు చేస్తున్నామని తెలుసు.. కానీ, వేరే మార్గం లేదు.. కన్నీళ్లు పెట్టిస్తున్న చివరి మెసేజ్!
- కూటమి ప్రభుత్వంలో అధికారుల ధన దాహానికి దూకిన /తోయబడ్డ బ్రాహ్మణ ఉద్యోగి….
- అన్న కోసం ప్రాణత్యాగం చేసిన చెల్లి- పైడితల్లి అమ్మవారి ఆలయ చరిత్ర ఇదే
- అక్టోబర్ 28న అట్లతద్ది- 11 అట్లు వాయనం ఇవ్వడం వెనుకున్న ఆధ్యాత్మిక రహస్యం ఇదే!





