వరంగల్ : ఇద్దరు వ్యక్తులు వేధించడంతో.. అవమానం భరించలేక మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్యకు పాల్పడ్డారు. హనుమకొండ పోలీసుల కథనం ప్రకారం… వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం సీత్యతండాకు చెందిన అనిత వరంగల్ పోలీస్ కమిషనరేట్ ఏఆర్ విభాగంలో పని చేస్తున్నారు. ఆమెను దూరపు బంధువైన మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం కొమ్మనపల్లి తండాకు చెందిన రాజేందర్ పెళ్లి చేసుకుంటానని నాలుగేళ్లుగా చెబుతూ వస్తున్నాడు. కానీ ఆమె డ్యూటీలో ఉండగా వీడియో కాల్ చేయమంటూ, వేరే ఎవరితోనో మాట్లాడుతున్నావు అంటూ తరచూ వేధించేవాడు. భరించలేక అనిత ఈ విషయం తల్లిదండ్రులకు చెప్పారు. వారు రాజేందర్ పద్ధతి నచ్చక, తమ కూతురిని అతడికి ఇచ్చి పెళ్లి చేయడం కుదరదని తెగేసి చెప్పారు. అయినా రాజేందర్ బతిమాలుతూనే ఉన్నాడు. మరోవైపు అనిత తన క్లాస్మేట్ జబ్బార్లాల్తో చనువుగా ఉండటం, వాళ్లిద్దరూ పెళ్లి చేసుకోవాలి అనుకోవడం రాజేందర్ తెలుసుకున్నాడు. కోపంతో జబ్బార్‌కు ఫోన్ చేసి చెడుగా చెప్పాడు. నమ్మిన జబ్బార్ కూడా అనితను వేధించడం మొదలు పెట్టాడు. పెళ్లి చేసుకోవాలంటే డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేయసాగాడు. ఈ నేపథ్యంలో తీవ్ర మానసిక ఆందోళనకు గురైన అనిత ఈ నెల 27న రాజేందర్‌కు ఫోన్ చేసి ‘నువ్వు, జబ్బార్ కలిసి నా జీవితాన్ని నాశనం చేశారు. మీవల్లే ఆత్మహత్య చేసుకుంటున్నాను’ అన్నారు. నిర్లక్ష్యంగా చావమని సమాధానం చెప్పాడు రాజేందర్. వెంటనే అనిత గడ్డిమందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. గమనించిన కుటుంబ సభ్యులు ఆసుపత్రిలో చేర్పించగా.. చికిత్స పొందుతూ మృతి చెందారు. పోలీసులు రాజేందర్, అతడి కుటుంబ సభ్యులు, జబ్బార్‌పై గురువారం కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.
Also read
- గదిలోకి మాస్క్ లేకుండా రావొద్దు.. హీలియం గ్యాస్ పీల్చుకుని చార్టర్డ్ అకౌంటెంట్ సూసైడ్..
- అందగా ఉంటుందని.. అమాయకరాలు అనుకునేరు..! విశాఖ రాథోడ్ మామూల్ది కాదు..
- ప్రేమ పేరుతో దారుణం.. బస్సులో నుంచి దింపి పొలాల్లోకి తీసుకెళ్లి యువతిపై అఘాయిత్యం..!
- Hyderabad: గది తలుపు తెరిచేసరికి షాకింగ్ సీన్..! యువ ఆర్కిటెక్ట్ మృతిపై ఎన్నో అనుమానాలు..!
- Hyderabad: హలో.. నేను అనన్య కులకర్ణి.. సాఫ్ట్వేర్ ఇంజనీర్‌కు సాఫ్ట్‌గా లైన్ కలిపింది.. కట్ చేస్తే..





