అనంతపురం జిల్లా యల్లనూరు మండలం కల్లూరులో ఘోర విషాదం చోటుచేసుకుంది. పులివెందుల బ్రాంచ్ కెనాల్ లో బట్టలు ఉతకడానికి వెళ్లిన నానమ్మ ఇద్దరు పిల్లలు దుర్మరణం పాలయ్యారు. నీటిలో మునిపోయిన మనవళ్లను కాపాడడానికి వెళ్లి.. నానమ్మ నాగలక్ష్మీ కూడా మృతి చెందింది.
AP News: అయ్యో పాపం బట్టలు ఉతకడానికి వెళ్లి.. నానమ్మ, ఇద్దరు మనవళ్ళు కాలువలో పడి చనిపోయారు. ఈ విషాదకర ఘటన యల్లనూరు మండలం కల్లూరు గ్రామంలో జరిగింది. అయితే నాగలక్ష్మి అనే మహిళ తన మనవడు, మనవరాలితో కలిసి గ్రామ సమీపంలోని పులివెందుల బ్రాంచ్ కెనాల్ లో బట్టలు ఉతకడానికి వెళ్ళింది.
మనవళ్ల కోసం
నాగలక్ష్మమ్మ బట్టలు ఉతుకుతుండగా మనవడు, మనవరాలు నీటిలో ఆడుకుంటూ ఉన్నారు. ఈ క్రమంలో మనవరాలు లిడియా, మనవడు జాషువా డానియల్ ప్రమాదవశాత్తు నీటిలో మునిగిపోయారు. దీంతో వారిని కాపాడేందుకు నీటిలోకి వెళ్లిన నాగలక్ష్మీ కూడా కాలువలో మునిగిపోయింది. ఈ ప్రమాదంలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. ముగ్గురి మరణంతో కుటుంబం కన్నీరు మున్నీరుగా విలపిస్తోంది.
Also read
- ఎంత కష్టమొచ్చిందో.. ఒకే కుటుంబంలో ముగ్గురు మృతి.. లెటర్ రాసి మరీ ఇలా..
- అయ్యో రేవతి.. కొడుకుకు ఈత నేర్పాలనుకుంది.. ఈలోపే ఏమైందంటే..
- మళ్లీ రెచ్చిపోయిన బాపట్ల రైలు దొంగల ముఠా.. అర్ధరాత్రి కాల్పులు జరిపిన రైల్వే పోలీసులు!
- పసికందు విక్రయ ఆరోపణలు కలకలం.. తల్లి అంగీకారంతో కేసులో కొత్త ట్విస్ట్
- రూ.33 లక్షల బకాయి బిల్లు కోసం బడికి తాళం.. రోడ్డున పడ్డ విద్యార్థులు, ఉపాధ్యాయులు!





