కర్నాటకలో మంగోలి కెనరా బ్యాంక్ బ్రాంచ్‌లో 59Kgల బంగారం చోరి అయ్యింది. మే 26న ప్యూన్ బ్యాంక్ దగ్గరకు వచ్చి చూడగా.. షట్టర్ తాళాలు కత్తిరించి ఉన్నాయి. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. బంగారం తాకట్టు పెట్టి గోల్డ్ లోన్స్ తీసుకున్న వారి బంగారం చోరికి గురైంది.
బ్యాంకులో బంగారం చోరి ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కర్నాటకలోని కెనరా బ్యాంక్ మంగోలి బ్రాంచ్‌లో దొంగలు బీభత్సం సృష్టించారు. దొంగలు 59కిలోల బంగారం ఎత్తుకెళ్లారని సీనియర్ పోలీసు అధికారి సోమవారం తెలిపారు. అదంతా బ్యాంక్‌లో గోల్డ్ లోన్ తీసుకున్న వారు తాకట్టు పెట్టిన బంగారం. మే 23 సాయంత్రం సిబ్బంది బ్యాంకుకు తాళం వేశారు. మే 24, 25 లు హలీడేస్ కావడంతో బ్యాంక్ తెరవలేదు. మే 26న ప్యూన్ శుభ్రం చేయడానికి వెళ్లినప్పుడు షట్టర్ తాళాలు కత్తిరించబడి ఉండటం గమనించాడు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.
మే 26న కెనరా బ్యాంక్ మంగోలి బ్రాంచ్ మేనేజర్ ఫిర్యాదు చేశారు. మొత్తం 59 కిలోల బంగారం చోరికి గురైనట్లు పోలీసులు తేల్చారు. మే 24, 25 తేదీల మధ్య రాత్రి ఈ దొంగతనం జరిగి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. తాకట్టు పెట్టి గోల్డ్ లోన్ తీసుకున్న వారిదే ఆ బంగారం అంతా అని ఎస్పీ నింబార్గి మీడియాకు తెలిపారు. ఈ కేసు దర్యాప్తు కోసం 8 టీంలను పెట్టి నిందితుల కోసం వెతుకుతున్నారు
Also read
- Medak: ప్రేమ పెళ్లి.. పేరెంట్స్‌ను కౌన్సిలింగ్‌కు పిలిచిన పోలీసులు.. ఆపై ఊహించని సీన్..
- Hyderabad: కుటుంబ సమేతంగా ఆత్మహత్యాయత్నం.. ఒక్క ఫోన్ కాల్ జీవితాలనే మార్చేసింది..!
- Ratha Saptami 2026: దరిద్రం వదిలి ఐశ్వర్యం వస్తుంది!.. రథ సప్తమి నాడు ఏ రాశి వారు ఏం దానం చేయాలి?
- Moon Transit: చంద్ర సంచారం.. ఈ మూడు రాశులకు జాక్‌పాట్.. ఊహించని లాభాలు!
- భార్యను చంపేశానంటూ పోలీస్ స్టేషన్లో లొంగిపోయిన భర్త.. విచారణలో సంచలనాలు..!





