తమిళనాడలోని పొల్లాచిలో దారుణం జరిగింది. ప్రేమించిన అమ్మాయి స్టేటస్ చూసి తట్టుకోలేక ఓ యువకుడు ఆమెను దారుణంగా చంపేశాడు. హత్యకు గురైన అమ్మాయిని అశ్విక (19)గా గుర్తించారు. పొల్లాచ్చిలోని అన్నామలై నగర్‌కు చెందిన ఆర్ ప్రవీణ్‌కుమార్ (25) ఆమెను హత్య చేశాడు.
తమిళనాడలోని పొల్లాచిలో దారుణం జరిగింది. ప్రేమించిన అమ్మాయి స్టేటస్ చూసి తట్టుకోలేక ఓ యువకుడు ఆమెను దారుణంగా చంపేశాడు. హత్యకు గురైన అమ్మాయిని అశ్విక (19)గా గుర్తించారు. ఆమె మలుమిచ్చంపాటిలోని ఓ ప్రైవేట్ కళాశాలలో బీఎస్సీ రెండవ సంవత్సరం చదువుతోంది. పొల్లాచ్చిలోని అన్నామలై నగర్‌కు చెందిన ఆర్ ప్రవీణ్‌కుమార్ (25) ఆమెను హత్య చేశాడు, అతను పొల్లాచ్చిలోని ఒక ప్రైవేట్ ఫైనాన్స్ సంస్థలో కలెక్షన్ ఏజెంట్‌గా పనిచేస్తున్నాడు.
రెండు సంవత్సరాల క్రితం అశ్విక, ప్రవీణ్ ఇద్దరూ ప్రేమలో ఉన్నారు. ఇరు కుటుంబాల పెద్దలు కూడా చదువు అయిపోయాక ఇద్దరికి పెళ్లి చేయాలని అనుకున్నారు. అయితే అశ్విక తన కాలేజీ స్నేహితులతో తీసుకున్న ఫోటోలను తన వాట్సాప్ స్టేటస్‌గా ఉంచుకునేది . ప్రవీణ్‌కుమార్ కాలేజీలోని మగ విద్యార్థుల ఫోటోలను వాట్సాప్ స్టేటస్‌గా ఉంచవద్దని ఆమెకు పలుమార్లు చెప్పాడు. ఇదే విషయంపై అమ్మాయి తల్లిదండ్రులకు కూడా చెప్పాడు. ఇప్పుడే ఇంత అనుమానిస్తున్నాడని వెంటనే ప్రవీణ్ సంబధాన్ని అశ్విక తల్లిదండ్రులు క్యాన్సిల్ చేసుకున్నారు. రెండు నెలల క్రితం ఆ సంబంధం తెగిపోయింది.
ఇద్దరు అబ్బాయిలతో ఫోటో
తాజాగా మరోసారి అశ్విక తన వాట్సాప్ స్టేటస్ లో ఇద్దరు అబ్బాయిలతో కూడిన ఓ ఫోటోను పెట్టింది. దీంతో కోపం పెంచుకున్న ప్రవీణ్.. అశ్విక ఒంటరిగా ఉన్న టైమ్ లో ఆమె ఇంటికి వెళ్లి గొడవకు దిగాడు. ఆమె మెడపై కత్లితో మూడు సార్లు దాడి చేశాడు. వెంటనే అక్కడి నుంచి పారిపోయి పొల్లాచ్చి వెస్ట్ పోలీసుల ముందు లొంగిపోయాడు. అమ్మాయి తండ్రి కన్నన్ మధ్యాహ్నం 12.30 గంటల ప్రాంతంలో ఇంటికి తిరిగి రాగా.. తీవ్ర రక్తస్రావంతో అపస్మారక స్థితిలో పడి ఉన్న తన కుమార్తెను పొల్లాచ్చి ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లాడు, అక్కడ ఆమె మరణించినట్లు వైద్యులు ప్రకటించారు. పోలీసులు ప్రవీణ్‌కుమార్‌పై కేసు నమోదు చేసి జ్యుడీషియల్ కస్టడీకి తరలించారు.
Also read
- వీడియోలతో బెదిరిస్తూ… పదేళ్లుగా లైంగికదాడి
- కట్టుకోబోయేవాడే చంపాడు..
- విద్యార్థినిపై టీచర్ ప్రేమ.. ఆమె కోసం అర్ధరాత్రి..
- ఈ 4 రాశులకు వరంలా లక్ష్మీ నారాయణ యోగం.. డబ్బు, విజయాలు, విలాస జీవితం ఇక ఖాయం!
- నరక లోయ ప్రయాణంలో ఆత్మ చేరుకునే ఐదవ పట్టణం శైలాగమం – ఆత్మకు అసలైన నరకం ఇక్కడే కనిపిస్తుందట





