ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి వద్ద ఆదివారం
జరిగిన రోడ్డు ప్రమాదం ఎల్లారెడ్డిపేట మండలం రాచర్లబొప్పాపూర్లో విషాదం నింపింది. శుభకార్యానికి వెళ్తున్న క్రమంలో భార్య మృతిచెందగా, భర్తకు తీవ్రగాయాలైనాయి. వివరాలు.. రాచర్లబొప్పాపూర్కు చెందిన మట్ట సురేశ్రరెడ్డి, దీప్తి (45) దంపతులు కూతురు సమీక్షతో కలిసి బతుకుదెరువు రీత్యా హైదరాబాద్లో నివాసం ఉంటున్నారు.
నిర్మల్ జిల్లాలో బంధువుల ఇంట్లో ఆడెల్లి పోచమ్మ బోనాల పండుగ ఉండడంతో ఆదివారం ఉదయం హైదరాబాద్ నుంచి కారులో భార్యాభర్తలు బయలుదేరారు. డిచ్పల్లి వద్ద కారు అదుపుతప్పి బోల్తాపడడంతో దీప్తి ఘటన స్థలంలోనే మృతిచెందింది. సురేశ్ రెడ్డి తీవ్ర గాయాలకు గురికాగా, ప్రాణప్రాయం లేదని వైద్యులు తెలిపారు. తల్లి మరణవార్త విన్న కూతురు సమీక్ష కన్నీరుమున్నీరుగా విలపిస్తోంది. రాచర్లబొప్పాపూర్లోని బంధువులు, కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు.
Also read
- అమెరికా వీసా రాక యువతి ఆత్మహత్య
- తల్లితో వివాహేతర సంబంధం.. కూతురుపై అత్యాచారం..!
- Andhra: రేయ్.. ఏంట్రా ఇది.. బయట బోర్డేమో ఒకటి.. లోపల మాత్రం కథ వేరు.. అనుమానం వచ్చి వెళ్లగా..
- AP Crime: నెల్లూరులో దారుణం.. మహిళను వేధించాడు.. నడి రోడ్డుపై నరికారు
- నేటి జాతకములు….14 ఆగస్టు, 2025