ముంబై: చికెన్ షావర్మా తిని సుమారు 12 మంది అస్వస్థతకు గురయ్యారు. ఫుడ్ పాయిజన్ జరిగి రెండు ఆసుపత్రిలో చేరారు. ఈ ఘటన మహారాష్ట్ర రాజధాని ముంబైలో చోటు చేసుకుంది.
బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ అధికారుల వివరాల ప్రకారం.. తూర్పు గోరేగావ్ ప్రాంతంలోని సంతోష్ నగర్లో శాటిలైట్ టవర్ వద్ద చికెన్ షావర్మా తిని రెండు రోజుల వ్యవధిలో 12 మంది అస్వస్థతకు గురయ్యారు. వెంటనే వారిని ఆసుపత్రికి తరలించారు.
వీరిలో తొమ్మిది మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా.. మరో ముగ్గురు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే ఫుడ్ పాయిజనింగ్ కారణంగానే వీరు అస్వస్థతకు గురై ఆసుపత్రిలో చేరినట్లు అధికారులు తెలిపారు.
Also read
- నేటి జాతకములు 10 సెప్టెంబర్, 2026
- (no title)
- కాళ్ల పారాణి ఆరకముందే తీరని విషాదం.. పాపం పెళ్లైన 6 రోజులకే వరుడు..
- పగలు భక్తులు.. రాత్రయితే దొంగలు.. దేవుడి సొమ్ము ఎలా దోచుకుంటున్నారో తెలుసా..?
- కారు కొనిచ్చి, రూ. 40 లక్షలు ఆర్థిక సహాయం.. ప్రియుడి చేసిన పనికి సాఫ్ట్వేర్ యువతి షాకింగ్ నిర్ణయం!





