సెల్ఫోన్ పేలి 11 ఏళ్ల బాలికకు తీవ్రగాయాలైన ఘటన ఏపీలోని పల్నాడు జిల్లా బెల్లంకొండ మండలం ఎమ్మాజీగూడెంలో చోటు చేసుకుంది.
బెల్లంకొండ, న్యూస్టుడే: సెల్ఫోన్ పేలి 11 ఏళ్ల బాలికకు తీవ్రగాయాలైన ఘటన ఏపీలోని పల్నాడు జిల్లా బెల్లంకొండ మండలం ఎమ్మాజీగూడెంలో చోటు చేసుకుంది. కుటుంబ సభ్యుల వివరాల మేరకు.. కుంచాల వెంకటేశ్వరరావు కుమార్తె వీరలక్ష్మి అయిదో తరగతి చదువుతోంది. శనివారం ఇంట్లో సెల్ఫోన్ ఛార్జింగ్ పెట్టి వీడియోలు చూస్తుండగా పెద్ద శబ్దంతో పేలిపోయింది. ఈ ప్రమాదంలో బాలిక కుడిచేతి రెండు వేళ్లు పూర్తిగా తెగిపోయాయి. పొట్ట భాగంలో గాయాలయ్యాయి. వెంటనే గుంటూరు వైద్యశాలకు తరలించారు.
Also read
- నేటి జాతకములు 10 సెప్టెంబర్, 2026
- (no title)
- కాళ్ల పారాణి ఆరకముందే తీరని విషాదం.. పాపం పెళ్లైన 6 రోజులకే వరుడు..
- పగలు భక్తులు.. రాత్రయితే దొంగలు.. దేవుడి సొమ్ము ఎలా దోచుకుంటున్నారో తెలుసా..?
- కారు కొనిచ్చి, రూ. 40 లక్షలు ఆర్థిక సహాయం.. ప్రియుడి చేసిన పనికి సాఫ్ట్వేర్ యువతి షాకింగ్ నిర్ణయం!





