*రిపోర్టర్ సిటీ కేబుల్ శివ ఎక్కడ..?
*శివ వాట్సాప్ స్టేటస్ ..
*ఆందోళనలో కుటుంబ సభ్యులు మిత్రులు
రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ పట్టణానికి చెందిన ఎలక్ట్రానిక్ మీడియా సివిఆర్ ప్రతినిధి శివ అలియాస్ సిటీ కేబుల్ శివ వీడియో వైరల్ అవుతుంది.
ఫ్రెండ్స్ మిమ్మల్ని అందరిని వదిలేసి వెళ్ళిపోతున్నా.. అంటూ తల్లిదండ్రులకు మీడియా ప్రతినిధులకు తన పదవ తరగతి ఇంటర్ స్నేహితులకు ఒక సమాచారం వీడియో ద్వారా పోస్ట్ చేశారు. తన అభివృద్ధిలో ఆర్థికంగా అన్ని విధాల ఆదరించిన మాజీ ఎమ్మెల్యే చౌలపల్లి ప్రతాప్ రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు అంటూ రిపోర్టర్ శివ వీడియోలో పేర్కొన్నారు. మీ అందరిని వదిలేసి వెళ్ళిపోతున్నా అంటూ వీడియో పోస్ట్ చేయడం అది వైరల్ గా మారడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. శివ లాస్ట్ లొకేషన్ వరంగల్ ప్రాంతంలో చూపించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. శివ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ప్రస్తుతం వరంగల్ లో శివ కోసం వెతుకుతున్న కుటుంబ సభ్యులు ఫోన్లో మాట్లాడుతూ తనకు ఏమి జరగకూడదని కోరుకుంటున్నారు. శివ కోసం కుటుంబ సభ్యులు బెంగ పెట్టుకోవడంతో పాటు అతని తల్లి ఆరోగ్యం క్షమించిందని కుటుంబ సభ్యులు తెలిపారు. శివ ఆచూకీ ఇంకా లభించలేదని ఎవరికైనా తెలిస్తే ఈ వీడియో చూసి అతని గురించి వివరాలు 8074697689 నంబర్ కు వెంటనే తెలియజేయాలని కుటుంబ సభ్యులు ప్రాధేయపడుతున్నారు. శివ ఇలాంటి అగైహిత్యం చేసుకోకూడదని సామాజిక మాధ్యమాల ద్వారా కుటుంబ సభ్యులు విజ్ఞప్తి చేస్తున్నారు…..
Also read
- Astro Tips for Marriage: గ్రహ శాంతి పూజ అంటే ఏమిటి? వివాహానికి ముందు గ్రహ శాంతి పూజను ఎందుకు చేస్తారో తెలుసా..
- శివ శక్తి రేఖ: పూర్వీకుల మేధస్సుకి చిహ్నం ఈ 8 శివాలయాలు.. ఒకే రేఖాంశం పై నిర్మాణం..
- మీరు వచ్చే జన్మలో ఎలా పుట్టనున్నారు.? మీరు చేసే పనులే ఆ విషయం చెబుతాయి..
- నేటి జాతకములు…8 డిసెంబర్, 2025
- ఒకరితో ప్రేమ… మరొక అమాయకుడితో పెళ్లి!





