ఓ బాలిక ఏడ్చుకుంటూ పోలీస్ స్టేషన్‌కు వచ్చింది. అక్కడున్న హెడ్ కానిస్టేబుల్, సిబ్బంది ఆమెను ఓదార్చి.. అసలేం జరిగిందని పూర్తి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆమె చెప్పిన మాటలు విని.. వీరంతా ఆశ్చర్యపోయారు. వెంటనే ఆమెను తన ఇంటికి తీసుకెళ్లి.. ఆపై ఇలా..
పోలీస్ స్టేషన్‌కు వెళ్లాలంటేనే అందరికీ అదొక రకమైన భయం. ఎందుకో తెలియదు గానీ ఆ ప్రదేశానికి వెళ్లాలంటేనే చాలామంది భయపడుతూ ఉంటారు. సమస్యలు ఉన్నా పోలీస్ స్టేషన్‌కు వెళ్లకుండా మధ్యవర్తులతోనే పరిష్కరించుకుంటూ ఉంటారు. కానీ ఇక్కడో బుడ్డది ధైర్యంగా పోలీస్ స్టేషన్‌కు వెళ్లి తన తల్లిదండ్రులకు జరిగిన అన్యాయంపై ఫిర్యాదు చేసింది. ఆ బాలిక ధైర్యసాహసాలకు పోలీసులు మెచ్చుకుని స్వయంగా వారే ఇంటికి తీసుకుని వెళ్ళి ఆ బాలిక సమస్యను పరిష్కరించారంట.
కడప జిల్లా బద్వేలు నియోజకవర్గంలోని కలసపాడు పోలీస్ స్టేషన్‌కు ఓ చిన్నారి ఏడుస్తూ వెళ్ళింది. అది గమనించిన అక్కడి పోలీసులు ఆ చిన్నారిని చేరదీసి ఏమి సమస్య అని సాదరంగా అడిగి తెలుసుకున్నారు. అయితే అక్కడకు ఏడ్చుకుంటూ వెళ్ళిన చిన్నారి పోలీసులకు జరిగిన విషయం అంతా చెప్పింది. తమ పక్కింటివారు తన తల్లిదండ్రుల వద్ద పదివేల రూపాయలు అప్పుగా తీసుకున్నారని, వాటిని అడిగితే ఇవ్వకుండా గొడవపడుతూ.. ఇబ్బంది పెట్టడంతో బాధ వేసి ఏడ్చుకుంటూ పోలీస్ స్టేషన్‌కు వచ్చానని లోహిత అనే ఐదో తరగతి చదువుతున్న విద్యార్థిని పోలీసులకు ధైర్యంగా తన సమస్యను చెప్పింది.
ఇది విన్న స్టేషన్‌లోని హెడ్ కానిస్టేబుల్, సిబ్బంది.. ఆమెను వెంటబెట్టుకుని ఇంటికి తీసుకుని వెళ్లి లోహిత సమస్యను పరిష్కరించారంట. దీంతో లోహిత చేసిన పనికి.. ఆమె ధైర్యానికి కలసపాడు పోలీసులే కాదు చుట్టుపక్కల వారందరూ కూడా ఆమె ధైర్య సాహసాలను మెచ్చుకున్నారు. లోహిత కలసపాడులోని సెయింట్ ఆంటోనీ స్కూల్లో 5వ తరగతి చదువుతుంది. ఐదో తరగతి చదువుతున్న ఈ చిన్నారి ధైర్యంగా పోలీస్ స్టేషన్‌కు వెళ్ళి తన తల్లిదండ్రులకు జరిగిన అన్యాయంపై వారికి ఫిర్యాదు చేసి.. వారి సమస్యను పరిష్కరించడంపై స్థానికులంతా ఆమెను మెచ్చుకుంటున్నారు
Also read
- Vastu Tips: ఇంట్లో డబ్బుకి కొరత ఉండకూడదంటే.. దక్షిణ దిశలో ఈ వస్తువులు పెట్టండి.. మార్పు మీకే తెలుస్తుంది..
- Telangana Crime : పెద్దపల్లి జిల్లాలో దారుణం ఇద్దరు యువకుల ప్రాణాలు తీసిన పంచాయతీ
- చిన్నతనంలోనే ఇంత పంతం ఎందుకు.. విద్యార్థుల మధ్య ఘర్షణ.. ఒకరు మృతి..
- Andhra News: తల్లిని చెట్టుకు కట్టేసి కొట్టారంటూ ఫేక్ వీడియోతో ప్రచారం.. కట్‌చేస్తే.. దిమ్మతిరిగే ట్విస్ట్!
- వీళ్లకు ఏమయ్యింది.. ప్రియుడు కలిసి భర్తను హత్య చేసిన భార్య.. ఆ తర్వాత ట్విస్ట్ ఇదే..