• ఎముకల సేకరణ
• మృతుడి బంధువు ఫిర్యాదు మేరకే అన్న అధికారులు
ఇల్లంతకుంట(మానకొండూర్): ఓ వ్యక్తి అంత్యక్రియలు పూర్తయిన నాలుగు రోజులకు మృతుడి ఎముకలు సేకరించిన ఘటన ఇల్లంతకుంట మండలంలోని ఓబులాపురంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. ఓబులాపురం గ్రామానికి చెందిన పెంటల శ్రీనివాస్(35) గత శుక్రవారం రాత్రి ఇంట్లోనే నిద్రించాడు.
శనివారం ఉదయం అతను మృతిచెందినట్లు కుటుంబసభ్యులు గుర్తించారు. అదేరోజు సాయంత్రం దహన సంస్కారాలు నిర్వహించారు. మృతుడికి భార్య, కుమారుడు, కూతురు ఉన్నారు. కాగా, శ్రీనివాస్ మృతిపై అనుమానం ఉందని బంధువుల్లో ఒకరు ఇల్లంతకుంట పోలీసులకు ఫిర్యాదు చేశారు.
దీంతో తహసీల్దార్ ఎంఏ. ఫారుక్, ఎస్సై శ్రీకాంత్ గౌడ్, సిరిసిల్ల ప్రభుత్వ ఆస్పత్రి వైద్యురాలు ఫాతిమా మంగళవారం ఓబులాపురం చేరుకున్నారు. మృతుడిని దహనం చేసిన స్థలానికి వెళ్లి, వైద్య సిబ్బంది సహకారంతో ఎముకలు సేకరించారు. వాటిని ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపించనున్నట్లు తెలిపారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పేర్కొన్నారు. ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశమైంది.
Also read
- Andhra Pradesh: ఒక్క రాంగ్ కాల్తో కొంపకొల్లేరు.. సినిమాను మించిన స్టోరీ.. ట్విస్టులు మామూలుగా లేవుగా..
- Andhra: ప్రియుడి మర్మాంగాన్ని కోసిన వివాహిత.. అనంతపురంలో కలకలం
- August Festivals: శ్రావణ మాసం ఆరంభం.. వరలక్ష్మీ వ్రతం నుంచి రాఖీ పౌర్ణమి వరకు ఆగస్టులో ముఖ్య పండుగలు..
- Sankashtahara Chaturthi: సంకష్టహర చతుర్థి.. విఘ్నాలను తొలగించి విజయాన్ని ప్రసాదించే మహత్తర వ్రతం
- Weekly Horoscope: ఈ రాశుల వారికి ఆకస్మిక ధనలాభం, ఉద్యోగ యోగం.. 12 రాశులకు వారఫలాలు





