బెట్టింగ్ యాప్ కేసుల నేపథ్యంలో యూట్యూబర్ హర్షసాయికి మాజీ లవర్ మిత్రా శర్మ బిగ్ షాక్ ఇచ్చింది. ‘నిన్ను కర్మ వెంటాడుతోంది. ఎప్పటికీ తప్పించుకోలేవ్. నీ ఫాలోవర్స్ కు సారీ చెప్పు. బ్యాంకాక్ నుంచి వచ్చేయ్’ అంటూ హర్ష పేరు ప్రస్తావించకుండా పోస్ట్ పెట్టింది.
Harsha Sai: బెట్టింగ్ యాప్ ప్రమోటర్స్ కేసుల నేపథ్యంలో యూట్యూబర్ హర్షసాయికి తన మాజీ ప్రియురాలు మిత్రా శర్మ మరో బిగ్ షాక్ ఇచ్చింది. హర్షసాయి బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్నాడనే ఆరోపణలు రావడంతో అతనిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ సందర్భంగా హర్షసాయి పేరు ప్రస్తావించకుండా మిత్రా సోషల్ మీడియాలో షాకింగ్ పోస్ట్ పెట్టింది. నిన్ను కర్మ వెంటాడుతోందని, ఎప్పటికీ తప్పించుకోలేవంటూ సంచలన కామెంట్స్ చేసింది
హలో మిస్టర్ చీటర్..
ఈ మేరకు ‘హలో మిస్టర్ చీటర్, మళ్ళీ బ్యాంకాక్ పారిపోయావ్ అని తెలిసింది. నీవు మమ్మల్ని మోసం చేసి మా జీవితాలు నాశనం చేసావ్. ఇప్పుడు నిన్ను కర్మ వెంటాడుతోంది. ఇప్పటికైనా నా మాట విని మారిపో. సొసైటీతోపాటు నీ ఫాలోవర్స్ కు సారీ చెప్పు. ఇకపై బెట్టింగ్ యాప్ ప్రమోషన్స్ చేయనని మాటివ్వు. ఈరోజే బ్యాంకాక్ నుంచి బయలుదేరి వచ్చేయ్. సజ్జనార్ సర్.. మీవల్ల చాలా కుటుంబాల భవిష్యత్తు బాగుంటుంది’ అంటూ తనదైన స్టైల్ లో రెచ్చిపోయింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన పోస్ట్ వైరల్ అవుతోంది.
.ఇదిలా ఉంటే.. గతంలో హర్షసాయి తనను పెళ్లి చేసుకుంటానని మోసం చేశాడంటూ మిత్రా శర్మ హైదరాబాద్ నార్సింగ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఆధారాలను సమర్పించి తన వద్ద రూ.2 కోట్లు తీసుకున్నాడంటూ ఫిర్యాదులో పేర్కొంది. దీంతో హర్షపై రేప్ కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేశారు.
Also read
- దేవుడా కాస్త కూడా జాలి కలగలేదా.. పెళ్లి సంబరంతో కలకలలాడాల్సిన ఆ ఇంట
- రైతు భరోసా డబ్బుల కోసమని బ్యాంకెళ్లిన రైతు.. అకౌంట్ చెక్ చేయగా..
- అర్జెంట్‌గా డబ్బు అవసరమని ఫోన్ అమ్మేందుకు వచ్చిన వ్యక్తి.. కొన్న కాసేపటికే
- కోదాడలో నకిలీ వస్తువుల గుట్టురట్టు.. బ్రాండెడ్ పేరిట ప్రాణాలతో చెలగాటం.. ముగ్గురు కంత్రీగాళ్ల అరెస్ట్!
- నమ్మకమే పెట్టుబడిగా నయా దందా.. ఏకంగా కోట్లు కాజేసిన కిలేడీ





