భార్యకు తెలియకుండా మరో మహిళతో సహజీవనం చేస్తూ, ఆమె కుమార్తెకు ఓణీల పండుగ నిర్వహిస్తున్న అల్లుడిని పిల్లనిచ్చిన మామ రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నాడు. కృష్ణా జిల్లా మచిలీపట్నంలోని ఓ ఫంక్షన్ హాల్‌లో ఈ ఘటన జరిగింది. విజయవాడకు చెందిన శ్రీనివాసరావు తన కుమార్తెను ఆరేళ్ల కిందట ఏలూరుకు చెందిన సాఫ్ట్‌వేర్ ఉద్యోగికి ఇచ్చి వివాహం జరిపించారు. ఐదేళ్లుగా తన కుమార్తెకు కుంటిసాకులు చెబుతూ, అల్లుడు దూరంగా ఉంటున్నట్లు శ్రీనివాసరావు తెలుసుకున్నారు. మరో మహిళతో సహజీవనం చేస్తూ ఆమె కుమార్తెకు ఓణీల పండుగ చేస్తున్నట్లు తెలుసుకుని అక్కడికి వెళ్లి అల్లుడిని నిలదీశాడు. అల్లుడి చొక్కా పట్టుకుని నిలదీయడంతో ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది.
సాఫ్ట్‌వేర్ ఉద్యోగిగా నమ్మించి తన కుమార్తెను కట్నకానుకలతో వివాహం చేసుకొని ఆమెతో సంబంధం లేకుండా మరో మహిళతో అక్రమ సంబంధం ఎలా కొనసాగిస్తాడంటూ నిలదీశారు. నా కూతురి జీవితాన్ని నాశనం చేసి, వేరే మహిళతో అక్రమ సంబంధం పెట్టుకొని ఆమె కూతురికి ఓణీల వేడుకలు జరుపుకుంటావా? అంటూ మామ ఆగ్రహావేశాలతో ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనతో వేడుకలో ఉన్నవారంతా ఒక్కసారిగా షాక్కు గురయ్యారు.
Also read
- డాక్టర్ ప్రియాంక మరణంపై హత్య కేసుగా నమోదు చెయ్యాలి KVPS డిమాండ్
- యూనియన్ బ్యాంక్‌లో అగ్ని ప్రమాదం.. కాలి బూడిదైన ఫైళ్లు
- Today Horoscope: ఈరోజు పన్నెండు రాశులకు ఎలా ఉంటుంది? మీ రాశి ఫలాలు చూసుకున్నారా?
- ఉదయం పరిచయం.. మధ్యాహ్నం పెళ్లి.. రాత్రికి శోభనం అంటే పరిగెత్తిన వరుడు.. తీరా చూస్తే..!
- రీ సర్వే మహిళా ప్రాణం తీసిందా! కర్నూలు జిల్లాలో ఉద్రిక్తత





