SGSTV NEWS
CrimeTelangana

Fake Doctor in Chaudhariguda: ‘మగపిల్లాడు పుట్టాలంటే నా దగ్గరికి రా’.. వైద్యం రాని వైద్యుడు


రంగారెడ్డి జిల్లా చౌదరిగూడలో నకిలీ క్లినిక్‌ కలకలం రేపింది. వైద్యం రాని ఓ ఫేక్ డాక్టర్ బాగోతం బట్టబయలైంది. హోమియోపతి చదివి అలోపతి వైద్యం చేస్తున్నట్లు గుర్తించారు. ఒక్క ఇంజక్షన్‌తో మగపిల్లలను పుట్టిస్తానంటూ.. శివలింగం అమాయక ప్రజలను మోసం చేస్తున్నాడు.


రంగారెడ్డి జిల్లా చౌదరిగూడలో నకిలీ క్లినిక్‌ కలకలం రేపింది. వైద్యం రాని ఓ ఫేక్ డాక్టర్ బాగోతం బట్టబయలైంది. హోమియోపతి చదివి అలోపతి వైద్యం చేస్తున్నట్లు గుర్తించారు. ఒక్క ఇంజక్షన్‌తో మగపిల్లలను పుట్టిస్తానంటూ..
శివలింగం అమాయక ప్రజలను మోసం చేస్తున్నాడు. శివలింగంకు అలోపతి ట్రీట్‌మెంట్ రాదు. అసలు అతను ఎంబీబీఎస్ కాదు. ఈ విషయం హాస్పిటల్ తనిఖీల్లో బయటపడింది.

రంగారెడ్డి జిల్లా DMHO అధికారులు తనిఖీలు నిర్వహించగా విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. శివలింగం అనే వ్యక్తి హోమియోపతి చదువి.. హలోపతి వైద్యం చేస్తున్నట్లు జిల్లా వైద్యాధికారులు గుర్తించారు. అతను అనుమతి లేకుండా ఫేక్‌ సర్టిఫికేట్స్‌తో ఆస్పత్రి నిర్వహిస్తున్నాడు. అధికారులు సర్టిఫికెట్స్‌ అన్నీ పరిశీలించి ఆస్పత్రిని సీజ్‌ చేశారు. అనుమతి లేకుండా క్లినిక్ పెడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

Also read

Related posts

Share this