April 4, 2025
SGSTV NEWS
Andhra PradeshCrime

Digital Arrest:వృద్ధుడి నుంచి రూ.కోటిన్నర కొట్టేసిన సైబర్ నేరగాళ్లు



అనకాపల్లి జిల్లా నర్సీపట్నానికి చెందిన 71 సంవత్సరాల విశ్రాంత ఉద్యోగి నుంచి సైబర్ నేరగాళ్లు ఏకంగా రూ.1.4 కోట్లు కాజేసిన విషయం ఆలస్యంగా వెలుగుచూసింది.


నర్సీపట్నం అర్బన్ : అనకాపల్లి జిల్లా నర్సీపట్నానికి చెందిన 71 సంవత్సరాల విశ్రాంత ఉద్యోగి నుంచి సైబర్ నేరగాళ్లు ఏకంగా రూ.1.4 కోట్లు కాజేసిన విషయం ఆలస్యంగా వెలుగుచూసింది. పట్టణ సీఐ జి.గోవిందరావు మంగళవారం వెల్లడించిన వివరాల ప్రకారం.. ‘మీ ఎకౌంట్ కు సంబంధించి భారీ కుంభకోణం జరగడంతో డిజిటల్ అరెస్టు అయ్యారు’ అని సైబర్ నేరగాళ్లు తొలుత వృద్ధుణ్ని ఫోన్ లొ తీవ్రంగా బెదిరించారు. అరెస్టు నుంచి తప్పించుకోవాలంటే సొమ్ము చెల్లించాలనడంతో బాధితుడు బ్యాంకులో ఫిక్స్ డ్ డిపాజిట్లుగా దాచుకున్న నగదును విత్ట్ చేసి మరీ వారికి పంపించారు. మూడు రోజుల వ్యవధిలో ఆ మొత్తాన్ని నిందితులు చెప్పిన ఖాతాలకు జమ చేసేశారు. తరువాత తాను మోసపోయినట్టు గుర్తించి 12 రోజుల క్రితం పోలీసులను ఆశ్రయించారు. బాధితుడి విజ్ఞప్తి మేరకు ఆయన పేరు, ఇతర వివరాలు వెల్లడించడం లేదని సీఐ తెలిపారు. వెంటనే అప్రమత్తమై బాధితుడు పంపిన కొంత నగదు విత్ డ్రా కాకుండా చూశామని, నిందితులను గుర్తించేందుకు ప్రత్యేక బృందాలను పంపించామని తెలిపారు. సైబర్ నేరగాళ్లు డిజిటల్  అరెస్టులంటూ భయపెట్టినా, ఇతరత్రా బెదిరించినా వెంటనే 1930 నంబరును సంప్రదించాలన్నారు.

Also read

Related posts

Share via