SGSTV NEWS online
Spiritual

Devotional :నవగ్రహ ప్రధాక్షణలు
చేసేటప్పుడు ఈ పద్ధతి పాటిస్తున్నారా……….?



Devotional : జోతిష్య శాస్త్రం ప్రకారం రాహువు
దుర్మార్గపు గ్రహంగా భావిస్తారు. ఒకవేళ జాతకంలో ఈ గ్రహం చెడు స్థానంలో ఉన్నట్లయితే వారికి మానసిక ఒత్తిడి తీవ్రంగా ఉంటుంది. ఇదికాకుండా ఆర్థిక నష్టం. జ్ఞాపకశక్తి కోల్పోవడం, కోపం, చేదు అనుభవాలు ఎదురుకావడం, భయం, శత్రువులు పెరగడం లాంటివి జరుగుతాయి.

అంతేకాకుండా చనిపోయిన పాము లేదా బల్లిని చూడటం, పక్షిని చూడటం, గోర్లు పడేయడం, పెంపుడు జంతువులను కోల్పోవడం లేదా చనిపోవడం, బాధ్యతారాహిత్యంగా లేదా అజాగ్రత్తగా ఉండటం లాంటి సమస్యలు వస్తాయి. ఇవి కాకుండా ప్రమాదాలు, అపోహలు, సమన్వయలోపాలు కూడా పెరుగుతాయి.

నవగ్రహ ప్రదక్షిణలకు ఒక పద్ధతి ఉంది. పద్ధతి ప్రకారం ప్రదక్షిణలు చేస్తే మంచి ఫలితాలుంటాయి. నవగ్రహాలలో సూర్యుడి విగ్రహం మధ్యలో తూర్పు వైపు ఉంటుంది. కాబట్టి సూర్యుడిని చూస్తూ లోపలికి వెళ్లాలి.. అక్కడి నుంచి ఎడమవైపు నుంచి కుడివైపుకి 9 ప్రదక్షిణలు చేస్తే మంచిది.

శుక్రవారం రోజు గోమోదం ధరించాలి. ఇది కాకుండా ఇంటి పూజామందిరంలో రాహువు యంత్రాన్ని వ్యవస్థాపించి వివిధ రకాల పూజలను నిర్వహించాలి. అంతేకాకుండా రాహువు బీజ మంత్రం ఓం భ్రాం భ్రాం సః రాహవే నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపించాలి


Related posts