దేవాలయ హుండీలో సొమ్ము కాజేయడానికి ప్రయత్నించిన ఒక దొంగ చెయ్యి అందులో ఇరుక్కుపోవడంతో 12గంటల పాటు నరకయాతన అనుభవించాడు. ఈ సంఘటన కామారెడ్డి జిల్లా భిక్కనూర్ మండలంలోని రామేశ్వర్ పల్లి గ్రామ శివారులో గల మాసుపల్లి పోచమ్మ ఆలయంలో చోటుచేసుకుంది. ఆలయంలో పనిచేసే సురేష్ రాత్రి 10 గంటల ప్రాంతంలో హుండీ పైభాగాన్ని ధ్వంసం చేశాడు.
అందులో డబ్బు తీసేందుకు హుండీ లోపల చేయ్యి పెట్టాడు. అయితే సురేష్ చేయ్యి హుండీలోనే ఇరుక్కుపోయింది.దీంతో సుమారు 12 గంటల పాటు సురేష్ నరకయాతన అనుభవించాడు. ఉదయం దేవాలయానికి వచ్చిన భక్తులు గమనించి గ్రామస్తులకు సమాచారం అందించారు. గ్రామస్తులు వచ్చి పోలీసుల సమక్షంలో గ్యాస్ కట్టర్తో సురేష్ చేతిని హుండీలోంచి తొలగించారు. అనంతరం దొంగతనానికి ప్రయత్నించిన వ్యక్తిని స్థానిక భిక్కనూర్ పోలీసులకు అప్పగించారు
Also read
- అనారోగ్యంతో బాధపడుతున్నారా.. ఆదివారం ఈ పరిహారాలు చేసి చూడండి..
- నేటి జాతకములు 24 నవంబర్, 2024
- Ganesha Temple: పెళ్ళికాని వారికి వివాహం జరిపించే వినాయకుడు.. ఈ ఆలయం ఎక్కడ ఉందంటే..
- ప్రియురాలితో DEO రాసలీలలు.. భార్య ఎంట్రీతో.. చివరకు ఏం జరిగిందంటే?
- Andhra Pradesh: ఆ దేవాలయం చుట్టూ పక్షుల ప్రదక్షిణలు.. దేవుడి మహిమే అంటున్న గ్రామస్తులు