ప్రేమించిన యువతి పెళ్లిని ఆపేందుకు ఒక యువకుడు చేసిన వింత ప్రయత్నం చివరకు అతన్ని, అతని స్నేహితులను జైలుపాలు చేసింది. తాను ప్రేమించిన అమ్మాయికి వేరే వ్యక్తితో పెళ్లి నిశ్చయమైందన్న కోపంతో, ఆ పెళ్లిని ఎలాగైనా చెడగొట్టాలని ఏకంగా పోస్టర్ల రాజకీయం నడిపాడు. అమ్మాయి కాబోయే భర్త ఊర్లో తామిద్దరం ప్రేమించుకుంటు న్నామంటూ పోస్టర్లు అంటించి కలకలం రేపాడు. చివరకు రంగంలోకి దిగిన సిద్దిపేట పోలీసులు నిందితుడితో పాటు అతని స్నేహితులను అరెస్ట్ చేశారు.
తాను ప్రేమించిన అమ్మాయికి ఇంట్లో వాళ్లే వేరే పెళ్లి చేస్తున్నారని.. తెలిసి ఆ పెళ్లిన ఆపేందుకు యువకుడు పెళ్లి కొడుకు గ్రామంలో ప్రేయసితో ఉన్న ఫోటోలు కలిగిన పోస్టర్లు అంటించిన ఘటన సిద్దిపేట జిల్లాలో వెలుగు చూసింది. అయితే ఇది జరిగిన రెండ్రోజుల తర్వాత సీన్ మొత్తం మారిపోయింది. పోస్టర్లు అంటించిన యువకుడితో పాటు అతని స్నేహితులను అరెస్ట్ చేసి పీఎస్‌కు తరలించారు పోలీసులు.
ప్రేమించిన అమ్మాయి ఎక్కడ దూరమైపోతుందో అని ఆవేశంలో ఓ యువకుడు చేసిన పని.. చివరకు అతనితో పాటు స్నేహితులను కూటా పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కించింది. వివరాల్లోకి వెళ్తే.. సిద్దిపేట జిల్లాలో ఒక వింత ఘటన వెలుగుచూసింది. ప్రేమ పేరిట ఓ యువకుడు చేసిన పిచ్చిపని అతన్ని కటకటాల పాలు చేసింది. దుబ్బాక మండలం పెద్దగుండవెళ్లి గ్రామానికి చెందిన వెంకటేష్ అనే యువకుడు ఒక యువతిని ప్రేమించాడు. అయితే, ఆ యువతి తల్లిదండ్రులు ఆమెకు రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లికి చెందిన ఒక యువకుడితో వివాహం నిశ్చయించారు. నిశ్చితార్థం కూడా ముగిసి, పెళ్లి పనులు శరవేగంగా సాగుతున్నాయి.
అయితే తాను ప్రేమించిన యువతి వేరొకరి సొంతం కాబోతుందనే విషయాన్ని వెంకటేష్ తట్టుకోలేకపోయాడు. ఎలాగైనా ఆ పెళ్లిని ఆపాలని ప్లాన్ వేశాడు. తాను, ఆ యువతి ప్రేమించుకుంటున్నట్లు, తమ మధ్య ఉన్న సంబంధాన్ని వివరిస్తూ కొన్ని పోస్టర్లను డిజైన్ చేశాడు. ఆ పోస్టర్లను తీసుకుని, యువతికి కాబోయే భర్త స్వగ్రామమైన సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లికి వెళ్లాడు. అర్ధరాత్రి వేళ గ్రామాల్లోని ప్రధాన కూడళ్లు, గోడలపై ఆ పోస్టర్లను అంటించి కలకలం సృష్టించాడు. ఉదయాన్నే లేచి చూసిన వరుడి కుటుంబ సభ్యులు, గ్రామస్థులు ఆ పోస్టర్లను చూసి షాక్‌కు గురయ్యారు.
ఈ విషయం కాస్తా వధువు కుటుంబ సభ్యులకు చేరింది..పెళ్లి చెడగొట్టేందుకే వెంకటేష్ ఈ నీచమైన పనికి ఒడిగట్టాడని గ్రహించిన యువతి కుటుంబ సభ్యులు తక్షణమే సిద్దిపేట త్రీ టౌన్ పోలీసులను ఆశ్రయించారు. బాధితుల ఫిర్యాదుపై అత్యంత వేగంగా స్పందించిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ప్రేమ పేరుతో అవతలి వారి జీవితాలను రోడ్డున పడేసేలా ప్రవర్తించిన వెంకటేష్ ఉదంతం స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమైంది. క్షణికావేశంలో చేసిన ఈ పని వల్ల అటు యువతి కుటుంబం మానసిక క్షోభకు గురికావడమే కాకుండా, ఇటు యువకుడు, అతనికి సహకరించిన స్నేహితుల జీవితాలు కూడా జైలుపాలయ్యాయి.
Also read
- వాచ్మెన్ దారుణ హత్య.. సీసీ కెమెరాల్లో రికార్డైన భయానక దృశ్యాలు..!
- శ్రీశైలంలో విషాదం.. అన్నదాన సత్రంలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురి ఆత్మహత్య!
- పాము కాటుకు నాటు వైద్యం.. పరిస్థితి విషమించి యువకుడి మృతి..!
- AE నూకరాజు కుటుంబం ఆత్మహత్య కేసులో ట్విస్ట్.. రిమాండ్ రిపోర్ట్‌లో కీలక విషయాలు..
- Raksha Bandhan: తొలిసారి రాఖీ ఎవరు ఎవరికి కట్టారు? పురాణాల్లోని ఆసక్తికరమైన కథలు





