SGSTV NEWS online
CrimeTelangana

రాజ్ కుమార్ ఎక్కడ..? తిమ్మాపూర్ రైల్వే స్టేషన్ దగ్గర కారు.. షాబాద్ ఆరు హ‌త్యల కేసులో స‌స్సెన్స్..



షాబాద్‌లో జరిగిన ఆరు హత్యల కేసు మిస్టరీ ఇంకా వీడలేదు. నిందితుడు రాజ్‌కుమార్ కోసం పోలీసులు ఎనిమిది ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు. హత్యల అనంతరం తన తండ్రికి ఫోన్ చేసి చనిపోతానని చెప్పిన రాజ్‌కుమార్ కారు తిమ్మాపూర్ రైల్వే స్టేషన్ సమీపంలో లభించగా, అతడి మొబైల్ లొకేషన్ కూడా అక్కడే నిలిచిపోయింది.


షాబాద్ ఆరు హ‌త్యల కేసులో స‌స్సెన్స్ ఇంకా వీడ‌లేదు. నిందితుడు రాజ్ కుమార్ కోసం పోలీస్‌ బృందాలు గాలిస్తున్నాయి. అత‌డిని ప‌ట్టుకునేందుకు దాదాపు 8 బృందాలు రంగంలోకి దిగాయి. హ‌త్యాకాండ త‌ర‌వాత రాజ్ కుమార్ త‌న తండ్రికి ఫోన్ చేసి చ‌నిపోతాన‌ని చెప్పిన‌ట్టు పోలీసుల విచార‌ణ‌లో తేలింది. అయితే అత‌డి కారుతిమ్మాపూర్ రైల్వే స్టేషన్ స‌మీపంలో దొర‌క‌గా మొబైల్ లొకేష‌న్ కూడా అక్కడే ఆగిపోయింది. కారు అక్కడే వ‌దిలేసిన రాజ్ కుమార్ కొత్తూరు మండలం తిమ్మాపూర్ రైల్వే స్టేషన్ వైపు వెళ్లిన‌ట్టు పోలీసులు గుర్తించారు. ప్రస్తుతం రైల్వే స్టేష‌న్‌లోని సీసీ టీవీ ఫుటేజ్‌ను ప‌రిశీలిస్తున్నారు. దీంతో రాజ్ కుమార్ నందిగామలో రైలు ఎక్కాడా.. ఎక్కితే ఏ ట్రైన్ ఎక్కాడు అనేది ఇప్పుడు ప్రశ్నగా మారింది. ఇప్పటికే.. పోలీసులు కీలక ప్రకటన చేశారు. నిందితుడు రాజ్‌కుమార్‌పై 2 లక్షల రివార్డ్‌ ప్రకటించారు. రాజ్ కుమార్ కనిపిస్తే చెప్పాలని ప్రకటించారు.


నిందితుడు రైల్వే స్టేషన్ కు వెళ్లడంతో అతడు ఆత్మహత్య చేసుకోలేదని.. పారిపోయేందుకు రైల్వే స్టేషన్ వెళ్లాడనే క్లారిటీ వచ్చింది. అయితే ఇప్పుడు ఎక్కడకు వెళ్లాడనేది తెలియాల్సింది. నిందితుడు పట్టుబడితే కఠినంగా శిక్షించాలని, ఉరితీయాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి.

ఇదిలా ఉంటే పోక్సో కేసులో అరెస్ట్ అయిన రాజ్ కుమార్ జైలు నుండి విడుదలైన తరవాత శనివారం కేసు పెట్టిన మైనర్ బాలిక ఇంటికి వెళ్లి ఆమెతో పాటు ఆమె తల్లి, నానమ్మను అత్యంత దారుణంగా హత్య చేశాడు. అనంతరం తన భార్య, ఇద్దరు పిల్లలను సైతం హత్య చేశాడు. రాజ్ కుమార్ మొత్తం ఆరు హత్యలు చేయడం దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది.


ఇదిలాఉంటే.. కేసు పర్యవేక్షణలో నిర్లక్ష్యంగా వ్యవహరించారనే కారణంతో ఇద్దరు పోలీసులపై అధికారులు చర్యలు తీసుకున్నారు. షాబాద్ సీఐ కాంతారెడ్డికి చార్జ్‌మెమో జారీ చేశారు.. అంతేకాకుండా ఈ కేసులో.. ఎస్సై రమేష్‌ను సస్పెండ్ చేశారు.

Also read

Related posts