హైదరాబాద్: మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. తల్లితో కలిసి బంగారం కొనుగోలు చేసేందుకు జ్యువెలరీ షాపునకు వెళ్లిన రెండున్నరేళ్ల చిన్నారి ప్రాణాలు కోల్పోయింది. సైనేడ్ పదార్థం నోటిలోకి వెళ్లడం వల్ల చిన్నారి అస్వస్థతకు గురై, ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. ఈ ఘటన జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలోని చింతల్లో చోటుచేసుకుంది.
ఆడుకుంటూ బయటకు వచ్చిన చిన్నారి!
వివరాల్లోకి వెళ్తే.. చింతల్ సస్తా బజార్ ఎదురుగా ఉన్న విష్ణు జ్యువెలరీ వద్ద బుధవారం (అక్టోబర్ 07) ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. రెండేళ్ల ఐదు నెలల వయసున్న మిషా అనే చిన్నారి తన తల్లితో కలిసి బంగారం కొనుగోలు చేసేందుకు షాపునకు వెళ్లింది. అక్కడ ఆడుకుంటూ ఒక్కసారిగా షాపు నుంచి బయటకు వచ్చిన చిన్నారి.. బయట ఉన్న సైనేడ్ పదార్థాన్ని తెలియక తాకి, నోటిలో వేసుకున్నట్లు కుటుంబసభ్యులు తెలిపారు.
ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి
చిన్నారి అస్వస్థతకు గురికావడంతో జ్యువెలరీ షాపు యజమాని ఆమెను సమీపంలోని ఆసుపత్రికి తరలించినట్లు తెలుస్తోంది. అయితే, అక్కడ చికిత్స పొందుతూ మిషా మృతి చెందింది. బంగారు ఆభరణాల తయారీకి సంబంధించిన పనుల్లో ఉపయోగించే సైనేడ్ పదార్థాన్ని నిర్లక్ష్యంగా వదిలివేయడం ఈ ఘటనకు కారణమై ఉండవచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
అయితే, చిన్నారి మృతికి ఖచ్చితమైన కారణం, సైనేడ్ పదార్థం ఆమె శరీరంలోకి ఎలా వెళ్లిందనే అంశాలపై అధికారిక నిర్ధారణ రావాల్సి ఉంది. పోలీసులు ఈ ఘటనపై విచారణ చేపట్టారు. చిన్నారి మృతితో కుటుంబంలో విషాదం నెలకొంది.
Also read
- కార్తీక పురాణం 16వ రోజు
- Today Horoscope: ఈరోజు పన్నెండు రాశులకు ఎలా ఉంటుంది? మీ రాశి ఫలాలు చూసుకున్నారా?
- ఉదయాన్నే గొర్రెలతో వెళ్లాడు.. రెండు రోజుల తర్వాత విగతజీవిగా.. మెదక్ జిల్లాలో విషాదం!
- అర్ధరాత్రి ఫోన్ చేసి బయటకు పిలిచారు.. పక్కా ప్లాన్‌తో ఏం చేశారంటే..
- కోట్లు ఉన్నాయంటూ కటింగ్.. ఒంటరిగా ఉన్నప్పుడు ఇంటికి పిలిచిన మహిళ.. కట్ చేస్తే..





