హైదరాబాద్‌లోని మలక్‌పేట డీ-మార్ట్ సిగ్నల్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. స్కూటీపై భర్తతో కలిసి వెళ్తున్న ఓ మహిళ అదుపుతప్పి రోడ్డుపై పడటంతో.. అటుగా వస్తున్న ఆర్టీసీ బస్సు ఆమెపై నుంచి వెళ్లిపోయింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన సదురు మహిళ స్పాట్లోనే ప్రాణాలు కోల్పోయింది. ఈ ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
హైదరాబాద్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పెళ్లైన నెల రోజులకే రోడ్డు ప్రమాదంలో ఓ యువతి ప్రాణాలు కోల్పోయింది. భర్తతో కలిసి స్కూటీపై వెళ్తుండగా మలక్‌పేట డీ-మార్ట్ సిగ్నల్ వద్ద బండి స్కిడ్ అవ్వడంతో బైక్‌పై ఉన్న యువతి.. పక్కనే వెళ్తున్న ఆర్టీసీ బస్సు చక్రాల కింద పడిపోయింది. బస్సు ఆమెపై నుంచి వెళ్లడంతో తీవ్రంగా గాయపడిన మహిళ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు కేకలు వేయడంతో గమనించిన డ్రైవర్ బస్సు ఆపడంతో.. భర్త ప్రాణాలతో బయటపడ్డారు.
వివరాల్లోకి వెళ్తే.. ఎల్బీనగర్కు చెందిన లావణ్య (25) తన భర్తతో కలిసి స్కూటీపై ఎల్బీనగర్ నుంచి చాదర్‌ఘాట్ వైపు వెళ్తున్నారు. ఈ క్రమంలో మలక్‌పేటలోని డీ-మార్ట్ సిగ్నల్ వద్ద బైక్ అదుపుతప్పడంతో ఇద్దరూ రోడ్డుపై పడిపోయారు.అదే సమయంలో అటుగా వెళ్తున్న ఆర్టీసీ బస్సుపై లావణ్యపై నుంచి వెళ్లిపోవడంతో తీవ్రంగా గాయపడిన లావణ్య స్పాట్లోనే ప్రాణాలు కోల్పోయింది.
ఇక స్థానికుల సమాచారంతో వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు పోలీసులు. గాయపడిన వ్యక్తిని హాస్పిటల్‌కు తరలించి.. మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం మార్చరీకి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసి.. ప్రమాదానికి సంబంధించి బస్సును, డ్రైవర్‌ను అదుపులోకి తీసుకుని దర్యాప్తు దర్యాప్తు చేస్తున్నారు. సీసీ కెమెరాలో రికార్డయిన ప్రమాద దృశ్యాల ఆధారంగా ఘటనకు సంబంధించిన వివరాలను పోలీసులు పరిశీలిస్తున్నారు.
Also read
- సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ నాగమణి మిస్సింగ్ మిస్టరీ.. భర్త సంచలన ప్రకటన.. అసలేం జరిగింది?
- తల్లితో కలిసి బంగారు షాపునకు వెళ్లిన చిన్నారి.. చివరకు ప్రాణాలు కోల్పోయిన విషాదం!
- పెళ్లైన నెల రోజులకే వెంటాడిన మృత్యువు.. భర్తతో కలిసి స్కూటీపై వెళ్తుండగా..
- Hyderabad: రూ.30 వేలకు మైనర్ బాలిక అమ్మకం.. చిన్న క్లూతో బయటపడ్డ పెద్ద యవ్వారం!
- పాకల బీచ్‌లో తీవ్ర విషాదం.. సముద్రంలో 8 మంది యువకులు గల్లంతు.. కొనసాగుతున్న గాలింపు!





