హైదరాబాద్‌లోని రాజేంద్రనగర్, ఉప్పర్‌పల్లి, లంగర్‌హౌస్, అత్తాపూర్ ప్రాంతాల్లో భారీ పేలుళ్లను పోలిన శబ్దాలు వినిపించాయి.. అంతేకాకుండా ప్రకంపనలు సైతం వచ్చాయి.. దీంతో స్థానికులు ఆందోళనకు గురయ్యారు. ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. ఈ శబ్దాలకు కారణం పేలుళ్లా, భూప్రకంపనలా లేదా మరేదైనా ఘటననా అనేది అధికారికంగా నిర్ధారణ కావాల్సి ఉంది.
హైదరాబాద్‌లో ఒక్కసారిగా కలకలం రేపింది.. రాజేంద్రనగర్ పరిధిలో పేలుళ్లు, ప్రకంపనల అలజడి రేగింది.. అనూహ్యంగా 4చోట్ల ఒక్కసారిగా భారీ పేలుళ్లు సంభవించాయి.. అంతేకాకుండా.. పేలుళ్లకు కొనసాగింపుగా భూప్రకంపనలు వచ్చినట్లు పేర్కొంటున్నారు. భూకంపం వల్ల పేలుళ్లా..! పేలుళ్ల వల్ల భూకంపమా..? ఏమైందో అర్థంకాక జనం పరుగులు తీశారు. రాజేంద్రనగర్, ఉప్పరపల్లి, లంగర్‌హౌస్, అత్తాపూర్ ఏరియాల్లో ఒక్కసారిగా పేలుళ్ల లాంటి శబ్దాలు.. ప్రకంపనలతో .. అంతా భయాందోళనకు గురయ్యారు. ఇళ్లనుంచి పరుగులు తీశారు. భారీ శబ్దాలకు గల కారణాలపై అధికారుల ఆరా తీస్తున్నారు.
Also read
- సోమనాథుడు – సౌరాష్ట్ర, గుజరాత్
- మద్యం సేవించి యువతి ఇంటికి వెళ్లిన యువకుడు.. కొద్దిసేపటికే తీరని విషాదం..!
- రాత్రి బాగానే ఉంది.. తెల్లారేసరికి కత్తిరించి ఉంది.. హాస్టల్లో అమ్మాయిల జడలు కత్తిరిస్తున్నదెవరు?
- యువకుడి ప్రాణాలు బలిగొన్న ఇయర్ ఫోన్
- 8 నెలల పసి బిడ్డను చంపి తల్లి మృతి!.. సూసైడ్ నోట్లో సంచలన విషయాలు! అసలు ఏం జరిగింది?





