మొన్న ఆదిలాబాద్ జిల్లాలో.. నేడు హైదరాబాద్‌లో.. తెలంగాణలోని మద్యం షాపుల్లో వరుస చోరీలు కలకలం రేపుతున్నాయి. అర్ధరాత్రుల్లో లిక్కర్ షాపులను టార్గెట్ చేసి.. నగదు, మద్యం సీసాలను ఎత్తుకెళ్తున్న ఘటనలు పోలీసులకు సవాల్ విసురుతున్నాయి. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. ఓ సారి లుక్కేయండి.
హైదరాబాద్‌లోని మద్యం షాపులను దొంగలు టార్గెట్ చేస్తున్నారు. కుత్బుల్లాపూర్ పరిధిలోని సూరారం శివాలయం నగర్ ఆర్యన్ వైన్స్‌లో దొంగలు పడ్డారు. వైన్స్ షాపు గోడకు కన్నం వేసి లోపలకి వెళ్లిన ఓ దొంగ.. లక్ష రూపాయల నగదు, 15 మద్యం బాటిల్స్ ఎత్తుకెళ్లాడు. చోరీకి సంబంధించిన దృశ్యాలు.. వైన్స్‌లోని సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. ఈ ఘటనపై వైన్స్ యజమాని సూరారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు.. సీసీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు. వైన్స్ షాపు చోరీ దొంగల కోసం గాలింపు చేపట్టారు.
ఇక.. ఈ నెల 9న ఆదిలాబాద్ జిల్లా బేలా మండల కేంద్రంలోని ఓ వైన్స్ షాపులోనూ దొంగలు పడ్డారు. వైన్స్ వెనుక వెంటిలేషన్ కిటికీ తొలగించి షాపులోకి చొరబడ్డ దొంగలు.. సీసీ కెమెరాలు ధ్వంసం చేసి మరీ చోరీకి పాల్పడ్డారు. ఈ ఘటనపై యజమాని బాల్‌రాజ్‌గౌడ్ ఫిర్యాదుతో పోలీసులు రంగంలోకి దిగారు. క్లూస్ టీమ్‌తోపాటు.. డాగ్ స్క్వాడ్‌తో వైన్స్ షాపు పరిసర ప్రాంతాల్లో పరిశీలించారు. వేలిముద్రాలను సేకరించి కేసు దర్యాప్తు చేపట్టారు. ఇక.. మద్యం షాపులోని 3 లక్షల రూపాయల నగదుతో పాటు 20 వేల విలువైన మద్యం బాటిల్స్ ఎత్తుకెళ్లినట్లు పోలీసులు గుర్తించారు. మొత్తంగా.. మద్యం షాపుల్లో వరుస చోరీలతో యజమానులు భయాందోళనకు గురవుతున్నారు
Also Read
- రైల్వే ట్రాక్‌పై మహిళకు ప్రసవం..
- పామర్రులో వీరంగం.. ఇద్దరు జర్నలిస్టులు అరెస్ట్
- నేటి జాతకములు…15 జనవరి, 2026
- ఇంట్లో పావురం గుడ్లు పెడితే ఏమవుతుంది.. అదృష్టమా లేక అశుభమా..?
- Shani Dev: మీరు ఈ రాశివారా? అయితే భయపడకండి.. శని దేవుడే మీకు రక్షణ కవచం!





