తల్లితండ్రులను వదిలి భవిష్యత్తు కోసం ఆరాటపడుతున్న అనుకున్నది సాధించలేక అసువులు బాస్తున్నారు. ఉన్న ఊరుని వదిలి దూరంగా ఉన్న కాలేజీలకు వచ్చి చేరి, చిన్న, చిన్న కారణాలకే కళాశాలలో ఆత్మహత్య చేసుకుంటున్నారు. అసలు వాళ్ళు ఎందుకు ఇలా ఆత్మహత్యలు చేసుకుంటున్నారో ఎవరికి అర్థం కావడం లేదు.. తాజాగా సంగారెడ్డి జిల్లా సుల్తాన్ పూర్ జేఎన్టీయూ(JNTU)లో ఇలాంటి ఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. విద్యార్థి ఆత్మహత్యపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
సూర్యాపేట జిల్లా మోతె మండలం సిరికొండ గ్రామ పరిధిలోని ఓ తండాకు చెందిన మహేశ్ శుక్రవారం (అక్టోబర్ 31) మధ్యాహ్నం హాస్టల్ గదిలో ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మూడు రోజులుగా కాలేజీకి వెళ్లకుండా రూమ్‌కే పరిమితమైన మహేశ్, ఇవాళ తోటి స్టూడెంట్స్ క్లాసులకు వెళ్లిన తర్వాత తలుపులు బిగించుకొని సూసైడ్ చేసుకున్నాడు. మధ్యాహ్నం రూంకు తిరిగి వచ్చిన తోటి విద్యార్థులు ఉరి వేసుకున్న మహేష్‌ను గమనించి యూనివర్సిటీ సిబ్బందికి సమాచారం ఇచ్చారు. వాళ్లు వచ్చి మహేష్‌ను కిందికి దింపి సమీపంలోకి ఆస్పత్రికి తరలించారు. కానీ అప్పటికే మృతి చెందినట్టు డాక్టర్లు ధ్రువీకరించారు.
కాగా, మృతుడి గదిలో సూసైడ్ నోట్ దొరకడంతో యూనివర్సిటీ సిబ్బంది తీసుకున్నట్లు తెలిసింది. అయితే ఆ లేఖలో ఏం రాశాడు.. అనేది ఇప్పుడు అందరికీ పెద్ద ప్రశ్నగా మారింది. అసలు మహేష్ ఎందుకు ఆత్మహత్యకు పాల్పడ్డాడు అనే విషయం తెలియరాలేదు. జేఎన్టీయూహెచ్‌లో మూడో సంవత్సరం చదువుతున్న మహేష్ మృతి ప్రస్తుతం మిస్టరీగా మారింది. ఈ డెత్‌పై పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది..!
Also read
- కార్తీక పౌర్ణమి 2025 తేదీ.. పౌర్ణమి తిథి, పూజకు శుభ ముహూర్తం ఎప్పుడంటే?
- శని దృష్టితో ఈ రాశులకు చిక్కులు.. ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది
- సాక్షాత్తు ఆ చంద్రుడు ప్రతిష్ఠించిన లింగం! పెళ్లి కావాలా? వెంటనే ఈ గుడికి వెళ్లండి!
- ఆ విషయాన్ని పట్టించుకోని అధికారులు.. కలెక్టరేట్లో పురుగుల మందు తాగిన రైతు..
- Viral: ఆ కక్కుర్తి ఏంటి బాబాయ్.! ప్రెగ్నెంట్ చేస్తే పాతిక లక్షలు ఇస్తామన్నారు.. చివరికి ఇలా





