వరంగల్ లోని మిల్స్ కాలనీ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆకతాయిల రెచ్చిపోయారు. నడిరోడ్డుపై మద్యం మత్తులో విన్యాసాలు చేస్తున్న పోకిరీలకు హితబోధ చేసిన పాపానికి వాహనదారులను వెంబడించి విచక్షణారహితంగా దాడి చేశారు. నడిరోడ్డుపై ఇష్టం వచ్చినట్లు కొట్టి బీర్ బాటిల్ తో తల పగలగొట్టారు. ఈ ఘటనతో స్థానికులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. సీసీ కెమెరాలలో రికార్డయిన దాడి దృశ్యాల ఆధారంగా పోలీసులు విచారణ చేస్తున్నారు.
ఈ దాడి ఘటన వరంగల్ మిల్స్ కాలనీ పోలీస్ స్టేషన్ పరిధిలోని శాకరాశికుంట ప్రాంతంలో జరిగింది. ఆ మార్గంలో కొందరు పోకిరీలు మద్యం మత్తులో బైక్ పై స్టంట్స్ చేస్తున్నారు. అటుగా వెళ్లే వాహనదారులకు తీవ్ర ఇబ్బందులు కలిగిస్తున్నారు. ఈ క్రమంలో ఓ వాహనదారులు అక్కడ ఆగి వారిని మందలించారు. రోడ్డుపై వారు చేస్తున్న విన్యాసాలు తప్పని ఆ పోకిరీలకు హితబోధ చేశారు. దీంతో మరింత రెచ్చిపోయిన చిల్లరగాళ్లు మద్యం మత్తులో చెలరేగిపోయారు. ఆ వాహనదారులను వెంబడించి, నడిరోడ్డుపై వాళ్ళ బైక్ ఆపి విచక్షణారహితంగా దాడి చేశారు. రోడ్డుపైనే పిడిగుద్దులతో దాడి చేసిన ఆకతాయిలు బీర్ బాటిల్ తో తల పగలగొట్టారు.
మత్తుకు బానిసలుగా మారిన పోకిరీలు ఈ మార్గంలో నిత్యం ఇలాంటి దారుణాలకు పాల్పడుతున్నారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పోకిరిలో ఆకు రౌడీల ఆగడాలకు అడ్డుకట్ట వేయాలని కోరుతున్నారు. గంజాయి మత్తులో స్థానిక ప్రజలను భయబ్రాంతులకు గురిచేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు విచారణ చేపట్టారు. సీసీ కెమెరా ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటికే కొంతమంది పోకిరీలను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సమాచారం
Also read
- Hyderabad: అంత ఈజీగా ఎలా నమ్ముతారో.. రిటైర్డ్ ఉద్యోగి నుంచి రూ.33 లక్షలు కాజేసిన కేటుగాళ్లు!
- Hyderabad: పెళ్లి పేరుతో వంచన.. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేపై లైంగిక వేధింపుల కేసు.. !
- ఇలా తయారయ్యారేంట్రా.. బాకీ తీర్చమని అడిగితే బంగారం ఇచ్చాడు.. తీరా చూస్తే!
- Andhra News: ఎలా వస్తున్నాయ్‌రా ఇలాంటి ఐడీయాలు.. లవర్స్‌ను చంపి ఏం చేశాడో తెలిస్తే..
- పెళ్లి తర్వాత ప్రేమ, అడ్డుగా ఉన్న భర్త హత్యకు స్కెచ్! పాపం.. మామ బలి





