SGSTV NEWS online
CrimeTelangana

అయ్యో.. దేవుడా..! చెత్త పడేసేందుకు వచ్చిన మహిళను కుమ్మేసిన ఎద్దు!



ఓ మహిళను ఎద్దు రూపంలో మృత్యువు కబలించింది. చెత్త వేసేందుకు వెళ్లిన మహిళపై అక్కడే ఉన్న ఓ ఎద్దు బలంగా దాడి చేసింది. ఈ దాడిలో ఆ మహిళ అక్కడికక్కడే కుప్పకూలి ప్రాణాలు విడిచింది‌. అందరూ చూస్తుండగా జరిగిన ఈ విషాద ఘటన మంచిర్యాల జిల్లాలో చోటు‌చేసుకుంది. దీంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.


ఓ మహిళను ఎద్దు రూపంలో మృత్యువు కబలించింది. చెత్త వేసేందుకు వెళ్లిన మహిళపై అక్కడే ఉన్న ఓ ఎద్దు బలంగా దాడి చేసింది. ఈ దాడిలో ఆ మహిళ అక్కడికక్కడే కుప్పకూలి ప్రాణాలు విడిచింది‌. అందరూ చూస్తుండగా జరిగిన ఈ విషాద ఘటన మంచిర్యాల జిల్లాలో చోటు‌చేసుకుంది.

మంచిర్యాల జిల్లా నస్పూర్ మండలం కృష్ణకాలనీ ఏ సెక్టార్ లో నివాసం ఉంటున్న ఒనపాక కళావతి అలియాస్ కమలమ్మ (52) బుధవారం (నవంబర్ 12) మున్సిపాలిటీ చెత్త బండి ఇంటి సమీపంలోకి రావడం చెత్త వేసేందుకు బయటకు వచ్చింది. కళావతి చెత్తను బండిలో వేసేందుకు వెళ్లగా అక్కడే ఉన్న ఓ ఎద్దు హఠాత్తుగా ఆమెపై దాడి చేసింది. ఈ దాడిలో తీవ్రంగా గాయపడ్డ కమలమ్మ అక్కడికక్కడే కుప్పకూలి ప్రాణాలు విడిచింది. మృతురాలికి ఇద్దరు కొడుకులు, ఇద్దరు కూతుళ్లు ఉండగా.. భర్త ఏడాది క్రితం చనిపోయాడు. తాజాగా ఎద్దు రూపంలో తల్లి మృతి చెందడంతో ఆ కుటుంబ శోకసంద్రంలో మునిగిపోయింది

Also Read

Related posts