SGSTV NEWS
Andhra PradeshCrime

Crime news: భర్తని చంపి.. డోర్ డెలివరీ చేసిన భార్య, బంధువులు


భార్య, ఆమె బంధువులు భర్తని చంపి పార్సల్ చేశారు. భార్య భర్తల గొడవల కారణంగా పల్నాడులో హత్య చేసి, మృతదేహాన్ని నంద్యాల్లో పడేశారు. పల్నాడు జిల్లా పిడుగురాళ్లలో నంద్యాల వాసి పెయింటర్ రమణని ఆయన బంధువులే దారుణంగా కొట్టారు. దీంతో అతను మరణించాడు

నంద్యాలలో షాకింగ్ ఘటన వెలుగుచూసింది. భార్య, ఆమె తరుపు బంధువులు భర్తని చంపి పార్సల్ చేశారు. భార్య భర్తల గొడవల కారణంగా పల్నాడులో హత్య చేసి, మృతదేహాన్ని నంద్యాల్లో పడేశారు. పల్నాడు జిల్లా పిడుగురాళ్లలో నంద్యాల వాసి పెయింటర్ రమణని ఆయన బంధువులే దారుణంగా కొట్టారు. దీంతో అతను మరణించాడు. రాత్రికి రాత్రే మృతదేహాన్ని నంద్యాలకు తీసుకెళ్లారు.

రమణ, రమణమ్మ నూనెపల్లె ప్రాంతంలో జీవనం సాగిస్తున్నారు. రమణ పెయింటర్‌గా పని చేస్తున్నాడు. కొన్నినెలలుగా భార్యభర్తల మధ్య తరుచూ విభేదాలు వస్తున్నాయి. రమణతో గొడవ పడి, రమణమ్మ 2 నెలల క్రితం పిడుగురాళ్ల పుట్టింటికి వెళ్లింది. రమణమ్మ కోసం మంగళవారం రమణ మద్య సేవించి పిడుగురాళ్ల వచ్చాడు. మద్యం మత్తులో రమణమ్మ బంధువులతో ఘర్షణ పడ్డాడు. బంధువులు కొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. రమణ మృతదేహాన్ని రాత్రి రాత్రే నంద్యాలలోని అతని ఇంటికి తరలించారు. మృతుడి శరీరంపై గాయాలు ఉండటంతో అనుమానం వ్యక్తం చేసి రమణ బంధువులు త్రీ టౌన్ పి.ఎస్.లో ఫిర్యాదు చేశారు. పోలీసుల విచారణలో మర్డర్ విషయం వెలుగులోకి వచ్చింది. రమణ మృతదేహాన్ని పోస్టుమార్థం కోసం నంద్యాల జి.జి.ఎచ్.కు తరలించారు.


Also read

Related posts

Share this