నగరంలోని నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలో కిడ్నాప్ కలకలం రేగింది. కొందరు దుండగులు ఓ వ్యాపారవేత్తను కొట్టి కారులో బలవంతంగా లాక్కెళ్లారు.
హైదరాబాద్: నగరంలోని నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలో కిడ్నాప్ కలకలం రేగింది. కొందరు దుండగులు ఓ వ్యాపారవేత్తను కొట్టి కారులో బలవంతంగా లాక్కెళ్లారు. దీంతో శిశువర్దన్రెడ్డిని కిడ్నాప్ చేశారంటూ ఆయన కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు అందిన తక్షణమే పోలీసులు స్పందించారు. బాధితుణ్ని హైదరాబాద్ నుంచి కర్నూల్‌కు తరలిస్తుండగా సినీఫక్కీలో కిడ్నాపర్స్ వాహనాన్ని ఛేదించి పట్టుకున్నారు. ఆర్థిక లావాదేవీలే ఈ కిడ్నాప్‌నకు కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు. కాసేపట్లో మీడియా సమావేశం ఏర్పాటు చేసి పూర్తి వివరాలు వెల్లడించే అవకాశం ఉంది.
Also read
- అన్నను స్కూల్ బస్సు ఎక్కించేందుకు తల్లి వెంటే వచ్చి.. అదే బస్సు కిందపడి మూడేళ్ల బాలుడు మృతి!
- వేడి సాంబార్లో పడి మహిళ మృతి.. సీసీ కెమెరాలో షాకింగ్ దృశ్యాలు!
- విష్ణుమూర్తి నాభి నుంచే పద్మం ఎందుకు పుట్టింది? బ్రహ్మదేవుడి ఆవిర్భావం వెనుక అసలు రహస్యం ఇదే!
- దుర్ముహూర్తం అంటే ఏమిటి? ఈ సమయంలో శుభకార్యాలు ఎందుకు చేయరు? కారణం ఇదే!
- Today Horoscope: ఈరోజు పన్నెండు రాశులకు ఎలా ఉంటుంది? మీ రాశి ఫలాలు చూసుకున్నారా?





