హర్యానాలోని ఫరీదాబాద్‌లో దారుణ ఘటన వెలుగు చూసింది. అదనపు కట్నం కోసం భర్త, అత్తింటి వారు కలిసి ఓ మహిళను దారుణంగా హత్య చేసి.. ఎవరికీ అనుమానం రాకుండా మృతదేహాన్ని తమ ఇంటి సమీపంలోని ఓ ప్రభుత్వ స్థలంలో గొయ్యి తీసి పూడ్చిపెట్టారు. ఆ తర్వాత ఆమె మరో వ్యక్తితో లేచిపోయినట్టు కుటుంబసభ్యులకు తెలిపారు. అనుమానంతో మృతురాలి సోదరి పోలీసులను ఆశ్రయించగా రెండు నెలల తర్వాత ఓ 10 అడుగుల గొయ్యిలో బాధితురాలి “తనూ” మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు.
ఇటీవల కాలంలో వరకట్న వేధింపులు పెరిగిపోతున్నాయి. డబ్బు పిచ్చి పెరిగిపోయిన కొందరు భర్తలు, అత్తింటి వారు కోడళ్లు తీసుకువచ్చే కట్నం సరిపోకా.. అదనపు కట్నం కోసం వారిని వేధింపులకు గురిచేస్తున్నారు. తాజాగా ఇంలాంటి ఘటనే ఒకటి హర్యానా జిల్లాలో వెలుగు చూసింది. అదనపు కట్నం కోసం భర్త, అత్తింటి వారు కలిసి ఓ మహిళను దారుణంగా హత్య చేసి.. ఎవరికీ అనుమానం రాకుండా మృతదేహాన్ని తమ ఇంటి సమీపంలోని ఓ ప్రభుత్వ స్థలంలో గొయ్యి తీసి పూడ్చిపెట్టారు. ఆ తర్వాత ఆమె మరో వ్యక్తితో లేచిపోయినట్టు ప్రచారం చేశారు. అనుమానం వచ్చిన బాధితురాలు సోదరి పోలీసులను ఆశ్రయించగా ఘటనపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు తాజాగా అత్తింటి సమీపంలోని ఓ సిమెంట్ స్లాబ్ కింద వివాహిత ‘తనూ’ మృతదేహాన్ని గుర్తించారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హర్యానాలోని ఫరీదాబాద్‌లోని రోషన్ నగర్ కు చెందిన అరుణ్‌కు, షికోహాబాద్ కు చెందిన తనూ అనే యువతితో రెండేళ్ల క్రితం వివాహం జరిగిందని. అయితే పెళ్లైన కొన్ని రోజులకే అత్తింటి వారు అదనపు కట్నం కోసం తనూను వేధించడం మొదటు పెట్టారని… దాంతో అత్తింటి వారి వేధింపులు భరించలేకపోయిన తనూ ఏడాది తర్వాత తిరిగి తమ ఇంటికి వచ్చేసినట్టు మృతురాలి సోదరి ఆరోపించినట్టు పోలీసులు తెలిపారు. అయితే తమ కుటుంబం శక్తిమేర తన సోదరి అత్తింటి వారి డిమాండ్లను తీర్చినా.. వారు “తనూ”ను వేధించడం మాత్రం ఆపలేదని పేర్కొంది. ఇక తనూను ఏడాది పాటు తమ దగ్గరే ఉంచుకొని.. ఆ తర్వాత నచ్చజెప్పి మళ్లీ అత్తింటికి పంపినట్టు ఆమె సోదరి తెలిపింది.
అయితే ఇంటికి వచ్చిన తనూ ను అత్తింటి వారు మళ్లీ వేధింపులకు గురిచేయడం స్టార్ట్ చేశారని.. తమతో ఫోన్ కూడా మాట్లాడనివ్వలేదని బాధితురాలి సోదరి తెలిపింది. అయితే ఏప్రిల్ 9వ తేదీన తన సోదరికి ఫోన్ చేయగా కలవలేదని అప్పుడే తనకు అనుమానం వచ్చినట్టు ఆమె చెప్పుకొచ్చింది. ఆ తర్వాత ఏప్రిల్ 23న అత్తింటి వారు ఫోన్ చేసి “తనూ” ఇంటి నుంచి పారిపోయిందని తమకు చెప్పారని ప్రీతి తెలిపింది. దీంతో అనుమానం వచ్చి పోలీసులను ఆశ్రయించినా వారు చాలా వారాల పాటు పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేసింది.
అయితే తమ ఇంటికి సరైన డ్రైనేజీ వ్యవస్థ లేదని బాధితురాలి మామ ఏప్రిల్ నెలలో తన ఇంటి పక్కన ప్రభుత్వ స్థలంలో గొయ్యి తీశారని.. మరుసటి రోజు ఉదయంలోపే దాన్ని హడావుడిగా పూడ్చేసి, పైన సిమెంట్ స్లాబ్ వేశారని స్థానికులు, విలేకరులకు కేసు దర్యాప్తు చేస్తున్న పోలీసులకు తెలిపారు. తను మామయ్య “గొయ్యి తవ్వడం అందరం చూశామని.. మురుగునీటి కోసం గొయ్యి అని చెప్పి ఇంతటి ఘోరాని ఒడిగడుతారని ఊహించలేదని తనూ పొరుగింటి వ్యక్తి ఒకరు పోలీసులకు తెలిపారు
Also read
- నేటి జాతకములు 14 జూలై, 2025
- Crime: కనిపించకుండ పోయిన బాలిక..అరెస్ట్ భయంతో ఊరంతా ఖాళీ!
- Telangana: సినిమా లెవెల్ స్కెచ్.. బెడిసికొట్టిన మాస్టర్ ప్లాన్.. ఇన్స్యూరెన్స్ డబ్బుల కోసం..
- Tamilnadu: నెయ్యితో దీపం.. కంటి సమస్యలను నయం చేసే ఆలయం.. పురాణాల ప్రకారం విశిష్టత ఏమిటంటే..
- Nirmal: తన పెళ్లి పత్రికలు పంచేందుకు బంధువుతో కలిసి బైక్‌పై వెళ్తున్నాడు.. ఇంతలో