మైనర్ బాలికను ఇద్దరు యువకులు వేధించారు. ప్రేమించకపోతే చంపేస్తామని బెదిరించారు. తల్లిదండ్రుల ఫిర్యాదుతో పోలీసులు రంగంలోకి దిగారు. నిందితులను అరెస్ట్ చేసి కటకటాల్లోకి పంపించారు. న్యాయస్థానం వారికి 14 రోజుల రిమాండ్ విధించింది. ఈ ఘటన ఎక్కడ జరిగింది..? అసలు ఏమైంది..? అనేది ఇప్పుడు తెలుసుకుందాం..
ఆంధ్రప్రదేశ్లోని పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో ఒక మైనర్ బాలికను ఇద్దరు యువకులు వేధింపులకు గురిచేశారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది. తనను ప్రేమించకపోతే యాసిడ్ పోసి చంపేస్తామంటూ యువకులు ఒక బాలికను భయభ్రాంతులకు గురిచేశారు. ఈ ఘటనపై పోలీసులు తక్షణమే స్పందించి నిందితులను కటకటాల వెనక్కి పంపారు. సత్తెనపల్లి పట్టణానికి చెందిన ఒక మైనర్ బాలికను గత కొంతకాలంగా అదే ప్రాంతానికి చెందిన కోటేశ్వరరావు, చిన్న కోటయ్య అనే ఇద్దరు యువకులు వేధిస్తున్నారు. సదరు బాలిక ఎక్కడికి వెళ్లినా వెంటపడటం, మాటలతో వేధించడం వంటివి చేస్తూ ఇబ్బంది పెట్టేవారు. నిందితుల వేధింపులు శృతిమించడంతో.. బాలిక వారిని నిలదీసింది. దీంతో ఆగ్రహించిన ఆ యువకులు.. తమను ప్రేమించకపోతే ముఖంపై యాసిడ్ పోసి చంపేస్తాం అంటూ బెదిరింపులకు దిగారు.
రంగంలోకి పోలీసులు
తమ బిడ్డకు ప్రాణహాని ఉందని గ్రహించిన బాలిక తల్లిదండ్రులు వెంటనే సత్తెనపల్లి పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు గాలింపు చర్యలు చేపట్టి, నిందితులు కోటేశ్వరరావు, చిన్న కోటయ్యలను అరెస్ట్ చేశారు. మైనర్ బాలికను వేధించినందుకు గాను వీరిపై పోక్సో చట్టం కింద, హత్య బెదిరింపుల సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. నిందితులను కోర్టులో ప్రవేశపెట్టగా, న్యాయస్థానం వారికి 14 రోజుల రిమాండ్ విధించింది. దీంతో పోలీసులు వారిని జైలుకు తరలించారు
Also Read
- ఎంతకు తెగించార్రా.. మఫ్టీ పోలీసుల పేరుతో రైతుల నిలువుదోపిడీ.. కట్ చేస్తే..
- అర్థరాత్రి ఇంట్లో నుంచి పెద్ద పెద్ద శబ్ధాలు.. అనుమానం వచ్చి ఉదయం వెళ్లి చూడగా.. వామ్మో
- ఒంటికి నిప్పంటించుకుని రోడ్డుపైకి..
- ‘నా చావుకు కారణం వెంకటేశ్..’
- కన్న కొడుకును కత్తెరతో పొడిచి చంపిన తల్లి.. ఎందుకో తెలుసా..?





