ప్రకాశం జిల్లా సింగరాయకొండ సమీపంలోని జాతీయ రహదారిపై జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో వృద్ధ దంపతులు అక్కడికక్కడే మృతి చెందగా, వారి మనవడు గాయపడ్డాడు. కందుకూరులో జరిగిన ఓ శుభకార్యానికి హాజరై తిరిగి వస్తుండగా వీరు ప్రయాణిస్తున్న బైక్‌ను వేగంగా వచ్చిన లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో వృద్ధ జంట అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు..
సింగరాయకొండ, జూన్ 5: ప్రకాశంజిల్లా సింగరాయకొండ జాతీయ రహదారిలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో వృద్ద దంపతులు అక్కడికక్కడే మృతి చెందారు. మృతులను షేక్ అల్లి సాహెబ్ (70) షేక్ నాగూర్ బి (60)లుగా గుర్తించారు. కందుకూరులో ఒక వివాహ కార్యక్రమానికి వెళ్ళి తిరిగి వస్తున్న క్రమంలో అమ్మమ్మ, తాతయ్యలను బైక్‌పై ఎక్కించుకుని మనవడు షేక్ నాగూర్ వలి (28) తీసుకొస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. సింగరాయకొండ దగ్గర జాతీయ రహదారిలోని ఎమర్జెన్సీ ల్యాండ్ సమీపంలో కళ్యాణ మండపం దగ్గర రోడ్డు దాటుతుండగా బైక్‌ను లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో అక్కడికక్కడే వృద్ద దంపతులు అల్లిసాహెబ్, నాగూర్‌బిలు మృతి చెందగా.. మనవడు నాగూర్‌వలికి తీవ్ర గాయాలయ్యాయి.
పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. సంతనూతలపాడు మండలం మంగమూరు గ్రామానికి చెందిన దంపతులు షేక్ అల్లి సాహెబ్ (70) షేక్ నాగూర్ బి (60) గురువారం కందుకూరులోని ఓ శుభకార్యానికి హాజరయ్యారు. తమ మనవడితో కలిసి బైక్‌పై తిరిగి మూలగుండపాడులోని తమ కుమార్తె దగ్గరకు వస్తున్నారు. ఇంతలో కనుమళ్ళ దగ్గర హైవేపై నెల్లూరు నుంచి ఒంగోలు వైపు వస్తున్న లారీ వీరి బైక్‌ను ఢీకొట్టింది.
ఈ ఘటనలో బైక్‌పై ప్రయాణిస్తున్న వృద్ద దంపతులు లారీ చక్రాల కిందపడి అక్కడికక్కడే చనిపోయారు. మనవడు నాగూర్‌వలికి స్వల్ప గాయాలయ్యాయి. వృద్ధ దంపతుల మృతదేహాలు హైవే రోడ్డుపై చెల్లాచెదురుగా పడిపోయాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకు మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం ఘటనపౌ కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
Also read
- స్లిమ్ చేస్తానని నమ్మించి.. యువతిని హోటల్ రూమ్‌కు రప్పించిన జిమ్ ట్రైనర్.. ఆపై..!
- హాట్సాఫ్ పోలీస్..! ప్రాణాలను పణంగా పెట్టి మహిళను కాపాడిన పోలీస్ హెడ్ కానిస్టేబుల్!
- కన్నీళ్లు పెట్టిస్తున్న విద్యార్థిని సూసైడ్ నోట్.. అసలేం జరిగిందంటే..?
- కీచకుడిపై చట్టపరమైన చర్యలు
- దస్తొవేజు లేఖరుల పొట్టకొట్టొద్దు…. గ్రీష్మ కుమార్, సి.పి.ఐ.(యం.యల్.)





