మందుల కోసం వెళ్లిన ఆ వృద్ధురాలు తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయింది. నిన్నటి వరకు కళ్ళముందే తిరిగిన వ్యక్తి, కాలువలో శవమై కనిపించడం స్థానికంగా పెను కలకలం రేపింది. ఒంటిపై ఉండాల్సిన బంగారు ఆభరణాలు మాయం కావడం, శరీరంపై గాయాలు ఉండటంతో ఇది పక్కా స్కెచ్‌తో జరిగిన హత్యేనన్న అనుమానాలు బలపడుతున్నాయి. గుంటూరు జిల్లా తెనాలి మండలం నందివెలుగుకు చెందిన డెబ్బై ఏళ్ల మాణిక్యం ఈ నెల 3న మెడిసిన్ కొనేందుకు తెనాలి వెళ్లింది. ఎప్పటిలాగే తమకు పరిచయం ఉన్న మెడికల్ షాపులో మందులు కొనుగోలు చేసింది. రాత్రి 7:30 గంటల సమయంలో ఇంటికి వెళ్లేందుకు ఆటో కోసం ఫోర్ రోడ్ జంక్షన్ వద్ద వేచి ఉన్నారు. అయితే రాత్రి 10 అయినా ఆమె ఇంటికి తిరిగి వెళ్లలేదు. 7.30 గంటల సమయంలో ఆటో పాయింట్ వద్దకు వచ్చిన మాణిక్యం ఆ తర్వాత ఎక్కడికి వెళ్లిందో తెలియని బంధువులు.. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
ఈ నెల 5న ఆటో నగర్ సమీపంలోని పంట కాలువలో వృద్దురాలి మృతదేహం కనిపించందని స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఆ మృతదేహం మాణిక్యంగా గుర్తించి కుటుంబసభ్యులకు సమాచారం ఇచ్చారు. మాణక్యం మెడపై, కంటిపై గాయాలున్నట్లు గుర్తించిన పోలీసులు బాడీని పోస్టుమార్టంకు తరలించారు. అంతేకాకుండా గాయాలతో పాటు ఆమె ఒంటిపై ఉండాల్సిన బంగారు ఆభరణాలు లేవు. దీంతో అనుమానాలు మరింత పెరిగాయి. ఆటో కోసం వేచి ఉన్న సమయంలో ఎవరైనా అమెను నమ్మించి తీసుకెళ్లి హత్య చేసి ఆభరణాలు తీసుకెళ్లారా అనే కోణంలో పోలీసుల దర్యాప్తు కొనసాగుతుంది. పోస్టుమార్టం నివేదిక కోసం పోలీసులు వెయిట్ చేస్తున్నారు. సీసీటీవీ పుటేజీ ఆధారంగా విచారణ చేస్తున్నారు.
Also Read
- మేడ్చల్ జిల్లాలో అమానుషం! పెళ్లికి నిరాకరించిందని యువతికి HIV ఇంజెక్షన్ ఇచ్చిన ఉన్మాది!
- చదువుకోమని కాలేజీకి పంపిస్తే ఏంటిదీ.. గలీజ్ పని చేస్తూ దొరికి డిగ్రీ ఫస్టియర్ స్టూడెంట్!
- చదువుకోవడానికి వచ్చి తనువు చాలించిన అనాథ బాలిక.. బాలసదన్‌లో బాలిక మృతికి కారకులెవరు..?
- చూసి అమాయకుడు అనుకునేరు.. ఏం చేశాడో తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే!
- ఘోరం.. వృద్ధురాలిని పీక్కుతిన్న పెంపుడు పిల్లులు..





