Vijayawada: ఏపీలో కొందరు ఉద్యోగులు రెస్టు లేకుండా పని చేస్తున్నారా? కనీసం ఇంటికి సైతం వెళ్లకుండా ఆఫీసులో గంటలు తరబడి గడుపుతున్నారా? ఆఫీసు వర్క్ ఏమోగానీ.. పర్సనల్ వర్క్ మాత్రం చేస్తున్నాడు ఓ సీనియర్ ఉద్యోగి. ఏకంగా ఆఫీసును తన బెడ్ రూమ్ మార్చేసుకున్నాడు. అడ్డంగా బుక్కయ్యాడు. ఇంతకీ ఎవరు, ఏంటి అనే స్టోరీలో వెళ్తే..
అసలు స్టోరీ ఏంటి?
రాసలీలలకు అడ్డగా మారుతున్నాయి ప్రభుత్వ కార్యాలయాలు. ప్రభుత్వ ఉద్యోగులు ఆఫీసులను తమ లైంగిక కోర్కెలు తీర్చుకునేందుకు షెల్టర్లుగా వాడుకుంటున్నారు. విజయవాడలోని బందర్ రోడ్డులో లైలా కాంప్లెక్స్ ఉంది. దాని దిగువన ఏపీటీడీసీ డివిజనల్ కార్యాలయం ఉంది. అందులో కమర్షియల్ విభాగాలు ఉన్నాయి. మల్టీప్లెక్స్ బిల్డింగ్ పెద్దదిగా ఉండడంతో గేట్లు ఏర్పాటు చేశారు. దానికి సెక్యూరిటీ కూడా ఉన్నారు.
ఓ సీనియర్ ఉద్యోగి రాసలీలల వ్యవహారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తనకు నచ్చిన యువతులు, మహిళలను అక్కడికి తీసుకొచ్చి వారితో కామ క్రీడలకు వేదికగా మార్చుకున్నాడు. ఎవరికి అనుమానం రాకుండా ఆఫీసులో పెండింగ్ పని పూర్తి చేయడానికి వచ్చినట్టు బిల్డప్ ఇచ్చేవాడు. బైక్‌పై ఓ మహిళను తీసుకొచ్చి తాళం తీసి లోపలికి వెళ్లేవాడు.
ఓ రేంజ్లో ఆ ఉద్యోగి బిల్డప్
గంట లేదా రెండు గంటలు లోపల గడిపి ఆ తర్వాత ఆఫీసుకు తాళం వేసి వెళ్లి పోయేవాడు. తొలుత లైటుగా తీసుకున్న సెక్యూరిటీ, ఆ ఉద్యోగి తీరుపై అనుమానం రెట్టింపు అయ్యింది. రోజుకో మహిళను తీసుకురావడంతో కొద్దిసేపు గడిపి వెళ్లిపోతున్నాడు. అయితే సెక్యూరిటీ సిబ్బంది ఈ విషయాన్ని ఉన్నతాధికారులకు చేరవేశారు. దీంతో ఆ సీనియర్ ఉద్యోగి సీక్రెట్ వ్యవహారం బయటపడింది.
సీసీటీవీ ఫుటేజ్ పరిశీలించిన అధికారులు సదరు ఉద్యోగిపై విచారణకు ఆదేశించారు. సీసీటీవీ ఫుటేజ్లోనున్న ఆ వ్యక్తి అకౌంట్స్ డిపార్ట్మెంట్లో పని చేస్తున్నాడు. ఆయన్ని వెంకటేశ్వర్లుగా గుర్తించారు. ఆ కార్యాలయం సెక్యూరిటీ సిబ్బంది వద్ద నుంచి వివరాలు సేకరించారు అధికారులు. దర్యాప్తు నివేదికను అధికారులు ఎగ్జిక్యూటివ్ ఈడీకి ఇచ్చారు. నివేదిక ఆధారంగా అకౌంటెంట్‌పై చర్యలకు రంగం సిద్ధమయ్యింది.
Also read
- జలుబు చేసిందని RMP డాక్టర్ దగ్గరికి వెళ్తే.. ఏకంగా ప్రాణాలే పోయాయ్!
- సిని ఫక్కీలో చేజింగ్.. చైన్ స్నాచర్లను పట్టుకున్న సరిహద్దు గ్రామస్తులు..! మహిళ సహా..
- ‘చనిపోయిన 7 నిమిషాల తర్వాత కూడా మెదడు పనిచేస్తుందట.. అప్పుడూ నీ గురించే ఆలోచిస్తా..!’
- Hyderabad: అతన్ని గుడ్డిగా నమ్మింది.. హోటల్‌కు వెళ్లింది.. కట్‌చేస్తే.. అసలు మ్యాటర్ తెలిసి..
- అగస్త్య మహర్షి ప్రతిష్ఠించిన శివలింగం- ప్రొద్దుటూరులో అరుదైన నవగ్రహ మండపం విశేషాలివే!




