భర్త చేతిలో భార్య దారుణ హత్యకు గురైన ఘటన కోలారు నగరంలోని శ్రీనివాసపురం సర్కిల్లో చోటు చేసుకుంది. నగర సమీపంలోని మూరాండహళ్లిలో నివాసం ఉంటున్న స్నేహ(26) హత్యకు గురైన మహిళ. స్నేహను భర్త రామచంద్ర కత్తితో పొడిచి తమ ముగ్గురు పిల్లల ఎదుటే హతమార్చాడు.
కోలారు తాలూకా నందంబళ్లి గ్రామానికి చెందిన స్నేహకు కెందట్టి గ్రామానికి చెందిన రామచంద్రతో ఆరేళ్ల క్రితం వివాహమైంది. వీరు కెందట్టిలో నివాసం ఉంటున్నారు. వీరికి ముగ్గురు సంతానం కలిగారు. అయితే రామచంద్ర ఒక హత్య కేసుకు సంబంధించి కొంతకాలంగా జైలులో ఉంటున్నాడు. ఇటీవల స్నేహ జీవనోపాధి కోసం కెందట్టిని వదిలి నగర సమీపంలోని మూరాండళ్లిలో నివాసం ఉంటోంది. కాగా జైలు నుంచి తిరిగి వచ్చిన రామచంద్ర భార్య నడతను అనుమానిస్తూ తరచుగా గొడవ పడేవాడు

ఆదివారం రాత్రి ఇద్దరి మధ్య తీవ్ర స్థాయిలో గొడవ జరిగింది. స్నేహ భర్తపై ఫిర్యాదు చేయడానికి తన ముగ్గురు పిల్లలతో కలిసి ఆటోలో పోలీస్ స్టేషన్కు బయలుదేరింది. దీంతో రామచంద్ర సినీ ఫక్కీలో వెంబడించి శ్రీనివాసపురం సర్కిల్ వద్ద ఆటోను అడ్డగించి స్నేహను ఆటో నుంచి కిందకు దించి తీవ్రస్థాయిలో ఆవేశానికి లోనై కత్తితో పొడిచి చంపాడు. ఘటనను ప్రత్యక్షంగా చూసిన పిల్లలు ముగ్గురు నిర్ఘాంతపోయారు. విషయం తెలిసి గల్పేటె పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. రామచంద్రను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Also read
- అన్న కోసం ప్రాణత్యాగం చేసిన చెల్లి- పైడితల్లి అమ్మవారి ఆలయ చరిత్ర ఇదే
- అక్టోబర్ 28న అట్లతద్ది- 11 అట్లు వాయనం ఇవ్వడం వెనుకున్న ఆధ్యాత్మిక రహస్యం ఇదే!
- అట్లతద్ది యొక్క ఆధ్యాత్మిక ప్రాముఖ్యత
- Today Horoscope: ఈరోజు పన్నెండు రాశులకు ఎలా ఉంటుంది? మీ రాశి ఫలాలు చూసుకున్నారా?
- ప్రభుత్వ ఉద్యోగం ఇప్పిస్తానంటూ మహిళపై లైంగిక దాడి




