రిగేపల్లి గ్రామంలో కర్ణాటక మద్యం అమ్ముతున్నారన్న సమాచారంతో ఎస్సై శోభారాణి ఓ హోటల్ లో తనిఖీలు నిర్వహించారు.. హోటల్లో అక్రమంగా కర్ణాటక మద్యం విక్రయిస్తున్న విషయం గుట్టు రట్టయింది. పైకి హోటల్ గా కనిపిస్తున్నా.. లోపల బెల్ట్ షాప్ నడుపుతున్న తండ్రి మల్లికార్జున్.. కూతురు కీర్తన వ్యవహారం బట్టబయలైంది.
ఆంధ్రా – కర్ణాటక సరిహద్దులో అక్రమ మద్యం రవాణాపై పోలీసులు గట్టి నిఘా ఏర్పాటు చేశారు.. అయినా అక్రమ మద్యం వ్యాపారులు ఎంతకు తెగించారంటే.. తమ గుట్టు రట్టు చేసిన మహిళ ఎస్సై పై దాడికి పాల్పడ్డారు. శ్రీ సత్య సాయి జిల్లా మడకశిర నియోజకవర్గంలోని ఆగలి మహిళా ఎస్సై పై అక్రమ మద్యం వ్యాపారులు దాడికి పాల్పడ్డ ఘటన సంచలనం రేపుతోంది.. అగలి మండలం ఇరిగేపల్లి గ్రామంలో కర్ణాటక మద్యం అమ్ముతున్నారన్న సమాచారంతో ఎస్సై శోభారాణి ఓ హోటల్ లో తనిఖీలు నిర్వహించారు.. హోటల్లో అక్రమంగా కర్ణాటక మద్యం విక్రయిస్తున్న విషయం గుట్టు రట్టయింది. పైకి హోటల్ గా కనిపిస్తున్నా.. లోపల బెల్ట్ షాప్ నడుపుతున్న తండ్రి మల్లికార్జున్.. కూతురు కీర్తన వ్యవహారం బట్టబయలైంది.
తండ్రీ, కూతురు అక్రమ మద్యం అమ్ముతుండగా మహిళా ఎస్సై శోభారాణి రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. మద్యం బాటిళ్ళను.. స్వాధీనం చేసుకొని అక్రమ మద్యం వ్యాపారం చేస్తున్న తండ్రి కూతురిని పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లే క్రమంలో.. మహిళా ఎస్సై శోభారాణితో.. తండ్రి మల్లికార్జున్, కూతురు కీర్తన వాగ్వాదానికి దిగారు. అంతటితో ఆగకుండా యువతి కీర్తన మహిళా ఎస్సై శోభారాణి చెంప చెళ్ళుమనిపించింది. అటు తండ్రి మల్లికార్జున్ కూడా మహిళా ఎస్ఎఫ్ఐ దాడి చేసేందుకు ప్రయత్నించడంతో.. వెంటనే కానిస్టేబుల్స్ అప్రమత్తమై తండ్రీ కూతుర్ని అదుపులోకి తీసుకున్నారు.
విధులకు ఆటంకం కలిగించడమే కాకుండా.. తనపై దాడి చేసిన మల్లికార్జున్ అతని కూతురు కీర్తన పై మహిళా ఎస్సై శోభారాణి ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న గుడిబండ పోలీసులు… తండ్రి కూతుర్ని రిమాండ్ కు పంపించారు. చేసేదే అక్రమ వ్యాపారం.. పైగా పట్టుకున్న మహిళ ఎస్సై పై దాడి చేస్తే.. పోలీసులు చూస్తూ ఊరుకుంటారా..? ఏంటి అంటూ స్థానికులు పేర్కొంటున్నారు.
Also read
- Medak: ప్రేమ పెళ్లి.. పేరెంట్స్‌ను కౌన్సిలింగ్‌కు పిలిచిన పోలీసులు.. ఆపై ఊహించని సీన్..
- Hyderabad: కుటుంబ సమేతంగా ఆత్మహత్యాయత్నం.. ఒక్క ఫోన్ కాల్ జీవితాలనే మార్చేసింది..!
- Ratha Saptami 2026: దరిద్రం వదిలి ఐశ్వర్యం వస్తుంది!.. రథ సప్తమి నాడు ఏ రాశి వారు ఏం దానం చేయాలి?
- Moon Transit: చంద్ర సంచారం.. ఈ మూడు రాశులకు జాక్‌పాట్.. ఊహించని లాభాలు!
- భార్యను చంపేశానంటూ పోలీస్ స్టేషన్లో లొంగిపోయిన భర్త.. విచారణలో సంచలనాలు..!





