SGSTV NEWS online
Andhra Pradesh

Andhra Pradesh: మందుకు బానిసైన కొడుకు.. టార్చర్ భరించలేక తండ్రి ఏం చేశాడంటే..?



విశాఖపట్నంలో దారుణం చోటుచేసుకుంది. మద్యం కోసం నిత్యం డబ్బు అడుగుతూ వేధించిన కొడుకు ప్రసాద్‌ను తండ్రి కర్రతో కొట్టి చంపాడు. మద్యం వ్యసనంతో పనికి వెళ్లకుండా ఇంట్లో గొడవపడే ప్రసాద్ టార్చర్ భరించలేక ఈ నిర్ణయం తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. మృతదేహాన్ని ఖననం చేయగా, కుటుంబ కలహాలతో విషయం వెలుగులోకి వచ్చింది.


కొడుకు మద్యానికి బానిస అయ్యాడు.. డబ్బుల కోసం నిత్యం వేధించేవాడు.. కొడుకు పరిస్థితి చూసి ఆ తండ్రి తల్లడిల్లి పోయాడు. నచ్చజెప్పినా వినేకపోవడంతో కఠిన నిర్ణయం తీసుకున్నాడు. కొడుకు టార్చర్ తట్టుకోలేక కొట్టి చంపేశాడు. ఆ తర్వాత మృతదేహాన్ని ఖననం చేశాడు. విశాఖలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన సంచలనంగా మారింది. ఆరిలోవ పోలీస్ స్టేషన్ పరిధిలోని విశాలాక్షినగర్ సమీపంలో లక్ష్మణరావు ధోబీ పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. అతనికి కొడుకు ప్రసాద్ భార్య, ఇద్దరు పిల్లలతో విజయవాడ కృష్ణలంకలో నివాసం ఉంటున్నాడు. కూలి పనులు చేసే అతడు.. గత కొంతకాలంగా మద్యానికి బానిసై.. పనికి వెళ్లడం లేదు. ఫుళ్లుగా మద్యం సేవించి భార్యతో గొడవ పడుతుండేవాడు. ఈ క్రమంలో విజయవాడలో ఉన్న భార్యా పిల్లలను వదిలి విశాఖలోని తల్లిదండ్రుల దగ్గరకు వచ్చేశాడు ప్రసాద్.

అప్పటి నుంచి పనికి వెళ్లకుండా ఇంట్లో ఉంటూ మద్యం కోసం డబ్బులు ఇవ్వాలని తరచూ కుటుంబ సభ్యులతో గొడవ పడేవాడు. ఈ నేపథ్యంలో ఈ నెల 6న తండ్రి, కొడుకుల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. వాడి టార్చర్ తట్టుకోలేక సహనం నశించిన తండ్రి లక్ష్మణరావు.. కర్రతో కొడుకు తలపై పలుమార్లు బలంగా కొట్టాడు. దీంతో తీవ్ర రక్తస్రావంతో కొడుకు ప్రసాద్ అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. ఆ తర్వాత మృతదేహానికి కుటుంబ సభ్యులంతా కలిసి ఈనెల7న ప్రసాద్ అంత్యక్రియలు నిర్వహించారు. ఆ తరువాత కుటుంబసభ్యుల మధ్య వాగ్వాదం జరిగిడంతో అసలు విషయం పోలీసులకు చేరింది. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడు లక్ష్మణరావును అదుపులోకి తీసుకున్నారు. మృతదేహాన్ని బయటకు తీసి పోస్ట్మార్టం కోసం మార్చురీకి తరలించారు

Also read

Related posts