అనంతపురం: అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మండలం బోరంపల్లిలో దారుణ ఘటన చోటు చేసుకుంది. కుటుంబ కలహాల నేపథ్యంలో ఓ భర్త తన భార్యపై దారుణ దాడికి పాల్పడ్డాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బోరంపల్లికి చెందిన ఎర్రిస్వామి తన భార్య రత్నమ్మపై అనుమానంతో కోపావేశంలో రత్నమ్మ గొంతు కోసి పరారయ్యాడు.
దాంతో రత్నమ్మ తీవ్రంగా గాయపడగా, ఆమెను తక్షణమే కళ్యాణదుర్గం ఆసుపత్రికి తరలించారు. అయితే పరిస్థితి విషమంగా ఉండడంతో అనంతపురం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్టు సమాచారం.
ఎర్రిస్వామి స్థానికంగా ఉన్న ఓ కాలేజీలో వాహన డ్రైవర్గా పనిచేస్తున్నాడు. అయితే భార్యపై అనుమానంతోనే ఈ దారుణానికి ఒడిగట్టినట్టు పోలీసులు తెలిపారు.
సదరు ఘటనపై కళ్యాణదుర్గం రూరల్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. పరారీలో ఉన్న ఎర్రిస్వామి కోసం ప్రత్యేక బృందాలు గాలింపు చర్యలు ప్రారంభించినట్టు తెలుస్తోంది.
Also read
- బాలుడి ప్రాణం తీసిన ఫోన్ వివాదం
- విశాఖ ఎక్స్ప్రెస్లో దారుణం.. ఏసీ బోగీలో ఖాళీ ఉందని చెప్పి ఆమెను తీసుకెళ్లాడు.. సీన్ కట్ చేస్తే..
- వైశాఖ పౌర్ణమి వేళ రాహు నక్షత్రంలోకి చంద్రుడు.. మే 1 నుంచి 4 రాశుల వారికి తిరుగులేని అదృష్టం
- పూజ ఫలితం రాకపోవడానికి అసలు కారణాలు.. తెలియక చేసే 9 తప్పులు ఇవే
- గరుడపురాణం ప్రకారం ఆత్మకు క్రూరత్వాన్ని చూపించేదే క్రూరపురం – ఆత్మ చేరుకునే 7వ పట్టణం ఇదే..





